News

అంబేద్కర్ ఇల్లు ‘రాజగృహ’ పై దాడి – వాస్తవాలు

1.1kviews

జులై 7 వ తేదీన డా.అంబేడ్కర్ “రాజాగృహ” లోకి ఒక వ్యక్తి చొరబడి ఆ ఇంటి పోర్టికోలోని పూల కుండీలను పగులగొట్టాడు.(ఇది CC కేమారాలలో చిత్రీకరించబడింది) 8వ తేదీన సమరసతా వేదిక జాతీయ కమిటీ సభ్యులు దా.రమేష్ పాండవ డా. అంబేద్కర్ ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూ “డా. అంబేడ్కర్ సమతా మూర్తి. వారి ఇల్లు రాజగృహా లోని గ్రంధాలయం జ్ఞాన కేంద్రం. ఆ ఇంటిపై దాడి ఖండనీయం. నిందితులను పోలీసులు వెంటనే అరెస్టు చేసి ప్రజలకు వాస్తవాలను తెలపాలి” అని ప్రకటించారు.

పోలీసులు ఆ దుండగుడిని వెంటనే అరెస్టు చేశారు. దాడి చేసింది ఒకే వ్యక్తి అని, దీని వెనుక ఎలాంటి కుట్ర, సంస్థ లేదని పోలీసులు ప్రకటించారు. వర్షం వస్తున్న సమయంలో ఆ యువకుడు తల దాచుకోవడం కొరకు పోర్టికోలోకి ప్రవేశించగానే, ఆ ఇంటిలోని వారు అతనిని బయటకు పంపించి వేశారని, ఆ కోపంతో అతను ఈ దాడి చేశాడని, ప్రహారీ గోడ దాటి లోపలికి వచ్చి పోర్టికోలో గల పూలకుండీలను ఆ దుండగుడు పగులగోట్టాడని పోలీసులు వెల్లడించారు. జరిగిన దుర్ఘటనపై అపోహలకు తావు లేకుండా ఉండడం కోసం సమరసతా వేదిక ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.