News

ఎదురు కాల్పుల్లో నలుగురు నక్సల్స్ మృతి

666views

బీహార్‌లో పోలీసులు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు నక్సల్స్ హతమయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. పశ్చిమ చంపారన్‌ జిల్లా బగహా ప్రాంతంలో నక్సల్స్‌ తిరుగుతున్నారన్న సమాచారంతో పోలీసులు శుక్రవారం ఉదయం గాలింపులు చేపట్టారు. ఈ క్రమంలో ఎదురుపడ్డ నక్సల్స్‌.. పోలీసులపైకి కాల్పులు జరిపారు. దీంతో ఎదురుకాల్పులు ప్రారంభించడంతో నలుగురు నక్సలైట్లు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఆపరేషన్‌లో బిహార్‌ పోలీసులతో పాలు సశస్త్ర సీమా బల్‌(ఎస్‌ఎస్‌బీ), స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌(ఎస్‌టీఎఫ్‌) బలగాలు పాల్గొన్నాయి. సంఘటనా స్థలంలో మూడు అత్యాధునిక తుపాకులు, భారీ పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.