News

చొరబాటుకు యత్నించిన ఉగ్రవాదులు హతం

940views

భారత్‌లోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఉత్తర కశ్మీర్‌లోని నౌగామ్‌ సెక్టార్‌లో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి శనివారం తెల్లవారు జామున ఇద్దరు అనుమానాస్పద వ్యక్తుల కదలికలను భద్రతా దళాలు గుర్తించాయని ఆర్మీ మీడియా ప్రతినిధి ప్రకటించారు. దీంతో వారిపై కాల్పులు జరిపామని, అందులో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని తెలిపారు. వారివద్ద రెండు ఏకే 47 తుపాకులు, ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.