News

ఆక్రమణలోని దేవస్థానం భూమి స్వాధీనం

754views

త కొన్నేళ్లుగా అన్యాక్రాంతమై వున్న సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెందిన భూమిని దేవస్థానం అధికారులు నేడు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నగరంలోని మాధవధార వద్ద సర్వే నంబర్ 47/1లో సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెందిన ఆరెకరాల భూమి ఉంది. అది గత కొన్నేళ్లుగా అన్యాక్రాంతమై ఉంది. ఈ భూమి ఆక్రమణపై కోర్టులో కొన్నేళ్లుగా దేవస్థానానికి, ఆక్రమణదారులకు కేసు నడుస్తోంది. ఇటీవల దీనిపై దేవస్థానానికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వడంతో ఆదివారం నాడు ఈవో వెంక టేశ్వరరావు ఆధ్వర్యంలో దేవస్థానం భూ పరిరక్షణ విభాగం ఎడీసీ శేషశైలజ, భూ పరిరక్షణ విభాగం ఏఈవో ఆనందకుమార్ తదితరులు వెళ్లి ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.