ArticlesNews

మేథావులూ జర దేఖ్ కే ఛలో……

583views

రోనా పై పోరాటంలో కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రపంచమంతా శ్లాఘిస్తున్నా, మరుగుజ్జ మనస్తత్వం కల్గిన కొందరు ( T V చానళ్శకు గుత్తగా కాంట్రాక్టు) మేధావులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో శ్రమ పడుతున్నారు. వారి శ్రమ చూస్తే జాలి , అసహ్యం పుడుతున్నాయి.

Lock Down ముందు అన్ని రాష్ట్రాల ప్రతినిధులతోనూ సంప్రదింపులు జరిపినా ఏకపక్ష నిర్ణయం అంటూ రేకుడబ్బా పదే పదే మోగిస్తున్నారు.

అయినా మన ముఖ్యమంత్రులు స్థానిక ఎత్తుగడలకు , ప్రజా ధనం దోపిడీకి ఇచ్చిన ప్రాధాన్యత ఈ కరోనాపై పెట్టినారా? లేదనటానికి బోలెడన్ని ఉదాహరణలు. ప్రాంతీయ పార్టీలు ఉన్నచోట మరీ దారుణం.

కరోనా వ్యాప్తికి ప్రధాన కారణమైన మర్కజ్ లేదా తబ్లిగిపై   లోతుగా చర్చించటానికి  ఎవరికీ నిజాయితీ లేదు, దమ్ము లేదు.

బైంసాలో నిరపరాధులపై ఆక్రమణ, భీభత్సం జరిగితే సరైన వార్తా సమీక్ష చేయలేని బలహీనులు మన మేథావులు.

వీళ్ళు – కరోనాపై జాగ్రత్తల విషయంలో ఒక్క మంచి ప్రోగ్రాం ఇవ్వలేదు. పైగా చేసేవన్నీ తప్పుల తడకల విశ్లేషణలు .

ప్రజలు ప్రాణాలగురించి ఆలోచిస్తుంటే – ఆర్ధికమాంద్యం గురించి మాట్లాడతారు.

ఆర్ధికపరమైన వెసులుబాటు గురించి మాట్లాడితే – మౌళిక సదుపాయాల గూర్చి మాట్లాడతారు. అంటే ప్రజలను అయోమయంలో పెట్టడమే వీరి లక్ష్యం .

Lock Down తరువాత కూడా ఒక సంవత్సరం వరకూ మరణాలు తగ్గినా కరోనా కేసులు మాత్రం ఉంటాయని, కరోనా కేసులు పెరుగుతాయని నిర్లక్ష్యం తగదని సాంకేతిక నిపుణులు అందరూ హెచ్చరిస్తూనే  ఉన్నారు.

ఇక తెలుగు రాష్ట్రాలలో మైనారిటీలు బహుళంగా నివసించే ప్రాంతాల్లో ఏ జాగ్రత్తలూ లేవు. కనీసం ఆ ప్రాంతాలలోకి అధికారులకు, పోలీసువారికి ప్రవేశం కూడా లేదు . కేంద్ర పరిశీలక బృందం ఇచ్చిన వివరణను ఈ మేధావులు చదివి విశ్లేషించాలి కదా? దానికి ఎవరు అడ్డుపడ్డారో పెరుమాళ్ళకెరుక!

అన్నీ తెలిసిన ప్రొఫెసర్ కు 3 చోట్ల అంటినట్లు, ఒకాయనకు ఇంకా కేసులు తగ్గవేమో ? Curve – Flet కాలేదు కదా? అని పదే పదే విమర్శస్తూ మనదేశాన్ని – ఏ దేశాలతో పోల్చాలో – కనీసం కామన్ సెన్స్ కూడా లేకుండా ఊదర కొడుతున్నారు.

అయ్యా  – మేధావులూ కష్టసమయంలో ప్రజలకు మంచి సలహాలు ఇచ్చి మనోబలాన్ని నిలబెట్టాలి గాని చౌకబారు విమర్శలతో మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు.

గుడ్డిగా మానవహక్కుల, (ప్రాధమిక హక్కుల ) పేరుతో విద్రోహకర శక్తులకు బాసటగా ఉంచే ప్రజలు క్షమించరు సుమా !

ఇప్పటి కైనా  సరైన పద్ధతిలో విమర్శ – సహేతుకమైన ఆలోచనలో నడవండి  – నడిపించండి- లేదంటే మీరు కూడా కరపత్రాలుగా మారిన దిన పత్రికల మాదిరి మిగిలి పోతారు సుమా…….

– మురళీ రవం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.