
1.2kviews
కర్నూలు జిల్లా, నంద్యాల సంఘమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పర్యావరణాన్ని శుద్ది కావించి, గృహ వైద్యంగా ఎన్నో రుగ్మతలను నయం చేసే తులసి మొక్కలను పంపిణీ చేయడం జరిగింది.


స్థానిక అరుంధతి నగర్, పి వి నగర్, నందమూరి నగర్, వైయస్సార్ నగర్, బుడగ జంగం కాలనీల్లో 600 తులసి మొక్కలను పంచి తులసి మొక్కల విశిష్టతను తెలియజేయండం జరిగిందని సంఘమిత్ర కార్యదర్శి శ్రీ చిలుకూరి శ్రీనివాస్ తెలిపారు.


ఈ కార్యక్రమంలో సంఘమిత్ర అధ్యక్షులు శ్రీ కె . నాగసుబ్బారెడ్డి, సంఘమిత్ర రాష్ట్ర సహ కార్యదర్శి శ్రీ మనోహర్, శ్రీ దిబ్బా రావు, శ్రీ దాసయ్య, శ్రీ రంగయ్య , ఆవాస ప్రముఖ్ శ్రీ గంగాధర్, శ్రీ చాంద్ స్థానిక పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.





