
మధ్యప్రదేశ్ లోని శివపురి జిల్లాలో, 19 ఏళ్ల బ్రాహ్మణ యువకుడు ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. దళిత వర్గానికి చెందిన ముగ్గురు వ్యక్తులు, మరో ఇద్దరు మహిళలతో కలసి సదరు యువకుడిపై దాడి చేసి దారుణంగా కొట్టడమే కాకుండా అతని చేత బలవంతంగా మూత్రం కూడా త్రాగించడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆ యువకుడు ఉరి బిగించుకుని తన జీవితాన్ని చాలించాడు.
అందిన సమాచారం ప్రకారం, బుధవారం మధ్యప్రదేశ్ రాష్ట్రం శివపురి జిల్లాలోని సాజోర్ గ్రామంలో మృతుడు వికాస్ శర్మపై దళిత వర్గానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దాడి చేసి, అతని చేత బలవంతంగా మూత్రం త్రాగించిన ఘటన అతని ఆత్మహత్యకు దారితీసింది. తన ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను వివరిస్తూ మృతుడు వ్రాసిన సూసైడ్ నోట్ ను, ఒక వీడియో క్లిప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మృతుడు వికాస్ శర్మ తన సెల్ ఫోన్లో మరణ వాంగ్మూలాన్ని చిత్రీకరించాడు. సూసైడ్ నోట్ మరియు వీడియో ప్రకారం, వికాస్ ఒక హ్యాండ్ పంప్ వద్దకు వెళ్లి, సమీపంలోని ఆలయంలో అర్చన చేయడానికి నీరు తీసుకున్నాడు. అతను నీటిని నింపేటప్పుడు, మనోజ్ కోలి, తారావతి కోలి, మరియు ప్రియాంక కోలి అనే ముగ్గురు దళిత వ్యక్తుల పాత్రలపై కొన్ని చుక్కలు పడ్డాయి.


మూత్రం త్రాగించారు….
ఈ చిన్న సంఘటనపై ఆగ్రహించిన ముగ్గురు దళిత వ్యక్తులు మరో ఇద్దరు మహిళలతో సహా తనను జుట్టు పట్టి లాగి కొట్టారని మృతుడు లేఖలో ఆరోపించాడు. అంతటితో ఆగక ఆ ముగ్గురు నిందితులు వికాస్ తీసుకెళ్లిన పాత్రను తీసుకొని, మానవ మూత్రంతో నింపి, తాగమని బలవంతం చేశారు.
ఈ సంఘటన తరువాత, వికాస్ శర్మ తీవ్ర నిరాశకు గురయ్యాడు. సూసైడ్ నోట్ వ్రాసి మరణిస్తున్నట్లుగా డిక్లరేషన్ వీడియోను చిత్రీకరించిన తరువాత తన గదిలోనే ఉరి వేసుకున్నాడు.
పోలీసులు నిందితులందరినీ అరెస్టు చేసి, ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు వారిపై ఐపిసి సెక్షన్ 306, ఐపిసి సెక్షన్ 323 కింద కేసు నమోదు చేసినట్లు శివపురి ఎస్పీ రాజేష్ సింగ్ చందేల్ తెలిపారు.
వికాస్ శర్మ మరణించిన విషయం తెలిసిన వెంటనే బ్రాహ్మణ సమాజానికి చెందిన ఒక ప్రతినిధి బృందం శివపురి జిల్లా అధికారులను కలిసి మధ్యప్రదేశ్ సిఎంను ఉద్దేశిస్తూ వ్రాసిన ఒక మెమోరాండం సమర్పించింది. మృతుని కుటుంబానికి ఒక కోటి రూపాయల నష్ట పరిహారాన్ని చెల్లించాల్సిందిగా కూడా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Source : OPINDIA





