
కరోనా వైరస్ సమస్య మరియు లాక్ డౌన్ ల వలన దెబ్బతిన్న చిన్న తరహా వ్యాపారస్తుల కోసం కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఉద్దీపనలని ప్రస్తావిస్తూ కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మరియు రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ప్రస్తుత పరిస్థితులలో వాళ్ళల్లో (వ్యాపారస్తులలో) విశ్వాసాన్ని నింపడం అతి పెద్ద సవాలు అని పేర్కొన్నారు.
NDTV కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యు లో ఆయన మాట్లాడుతూ ‘’కరోనా తో కలిసి జీవించే కళని మనం నేర్చుకోవాలి. ఇది సహజసిద్ధ వైరస్ కాదు. కృత్రిమంగా తయారైన ఈ వైరస్ ని నివారించడం కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వాక్సిన్ కోసం ప్రయోగాలు చేస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే వాక్సిన్ అందుబాటులో లేదు. త్వరలోనే అది అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నాము. అప్పుడు ఇక సమస్య ఉండదు.” అన్నారు.
“ఆ వైరస్ ని (సోకినప్పుడు) కనుగొనే పద్ధతి మరొక సమస్య. మన దగ్గర ఒక మంచి పద్ధతి ఉంటే, అది సోకగానే కనుగొనవచ్చు. ఇది లాబోరేటరీలో సృష్టించబడినది కాబట్టి, దీనిని ఎదుర్కొనడానికి ప్రపంచము, భారత దేశమూ, శాస్త్రవేత్తలూ ఇప్పుడు సంసిద్ధులయ్యారు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొంటే మనం (ప్రజలలో) విశ్వాసం నింపగలము. వాక్సిన్ కనుగొంటే ఇక సమస్య ఉండదు. అది భయాన్ని పూర్తిగా తొలగిస్తుంది.” అన్నారు.
దేశవ్యాప్త లాక్ డౌన్ లో చిక్కుకుపోయి, భయంతో వాళ్ళున్న ప్రాంతాలను వదిలి వెళ్ళిన వలస కార్మీకులు, పరిస్థితులు చక్కబడినాక మళ్ళీ తిరిగివస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. “మనం కేవలం వైరస్ తో పోరాడటమే కాకుండా, ఒక ఆర్ధిక సవాలును కూడా ఎదుర్కొంటున్నాము. మనది పేద దేశము, లాక్ డౌన్ ని నెల నెలా పొడిగించలేము.”అని ఆయన అభిప్రాయపడ్డారు.
వివిధ రంగాలు ఈ వైరస్ సమస్య నుండి బయట పడేందుకు ప్రధాని మంగళవారము నాడు 20 లక్షల కోట్ల ఉద్దీపన పాకేజ్ ని ప్రకటించారు.
దీనిలో భాగంగా ప్రభుత్వం చిన్న తరహా వ్యాపారాలకి మూడు లక్షల కోట్ల పూచీ లేని ఋణాలను ప్రకటించింది. అలాగే కరోన వైరస్ సంక్షోభం లో దెబ్బ తిన్న బ్యాంకింగేతర మరియు గృహ ఋణాలను మంజూరు చేసే కంపెనీలను ఆదుకునేందుకు 30వేల కోట్ల నిధులు మంజూరు చేయబడ్డాయి.
జీతాలు కాని చెల్లింపుల మీద 25 శాతం పన్ను తగ్గింపు, పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులకు చట్టబద్ధ చెల్లింపుల కోసం ఉన్న నిధికి మద్దతు, నగదు కొరతను ఎదుర్కొంటున్న విద్యుత్ పంపిణీ కంపెనీలకు 90వేల కోట్ల ఆర్ధిక మద్దతు, ప్రభుత్వ ప్రాజెక్టులను చేపట్టిన నిర్మాణ కంపెనీలు పనులు పూర్తి చేయడానికి ఆరు నెలల గడువు పొడుగింపు లాంటివి కూడా ఈ ఉద్దీపన పాకేజ్ లో భాగంగా ప్రకటించబడ్డాయి.
రాబోయే రోజుల్లో ప్రభుత్వం వెల్లడించబోయే అనేక పథకాలలో ఆర్ధిక మంత్రి చేసిన ఈ ప్రకటన మొదటిది.
పూర్తిగా పెట్టుబడి ఆధారంగా నిర్వచించబడ్డ MSME ల నిర్వచనాన్ని ఎక్కువ పెట్టుబడి, ఉత్పత్తి గల కంపెనీలకు వర్తించే విధంగా మార్చబడింది. ఇందువలన వాటికి ఆర్ధిక మరియు ఇతర రాయితీలు అందుతాయి.
స్థూల జాతీయోత్పత్తిలో మూడవ వంతు ప్రాతినిధ్యం వహిస్తూ, 11 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు కరోనా వైరస్ వలన ఎదురౌతున్న అవాంతరాలను ఎదుర్కొనేందుకు సహాయపడేలా బుధవారం నాటి పాకేజ్ ప్రకటించబడింది.





