News

News

చీరాలలో మూసివేసిన ఆలయాన్ని తెరిపించిన నటుడు నిఖిల్

టాలీవుడ్ నటుడు నిఖిల్ రియల్ హీరో అనిపించుకున్నాడు. ఏళ్లుగా మూసేసిన ఆలయాన్ని తెరిపించిన ఆయన.. దాని నిర్వహణ బాధ్యతలు తీసుకున్నాడు. గొప్ప పనిచేశావంటూ గ్రామస్థులు కొనియాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని చీరాలలో కొన్ని సంవత్సరాలుగా ఓ ఆలయం మూసి ఉంది. ఈ ఆలయాన్ని తిరిగి తెరిపించిన నిఖిల్‌పై గ్రామస్థులు ఆదరాభిమానాలు కురిపిస్తున్నారు. ఆలయాన్ని తిరిగి తెరిపించేందుకు వచ్చిన నిఖిల్‌ను పూలపై నడిపించి ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన వీడియోను పంచుకున్న నిఖిల్.. మీకు సేవ చేసే భాగ్యాన్ని తన కుటుంబానికి కల్పించారంటూ ఆనందం వ్యక్తంచేశారు. ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఇటీవల కార్తికేయ-2తో తిరుగులేని విజయాన్ని అందుకున్న నిఖిల్ ప్రస్తుతం స్వయంభు సినిమాలో నటిస్తున్నాడు. నిఖిల్ ఇందులో వారియర్‌గా కనిపించబోతున్నాడు. కాగా, ఇటీవల నిఖిల్ దంపతులు ఓ చిన్నారికి జన్మనిచ్చారు....
News

భారత ఎన్నికల నిర్వహణను ప్ర‌శంసించిన‌ అమెరికా

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికల నిర్వహణపై అమెరికా ప్రశంసల వ‌ర్షం కురిపించింది. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా ముగించిన‌ భారత ప్రభుత్వానికి, దేశ ప్రజలకు అభినందనలు తెలియజేసింది. అయితే ఎన్నికల ఫలితాలపై తాము వ్యాఖ్యలు చేయబోమని, ఎవరు గెలిచినా...
News

హిందూ రాష్ట్రo అనేది ఒక ఉదాత్త సిద్ధాంతం

హిందూ రాష్ట్రo అనేది ఒక ఉదాత్త సిద్ధాంతం. వివిధ వర్గాలు, వర్ణాల ప్రజల మధ్య గల మౌలిక ఏకత, సమాన సంప్రదాయాలను సూచించేది ఇదే. హిందూ పదం అంటేనే భయపడి పారిపోయే వారివల్ల ఈ దేశపు భౌగోళిక, సాంస్కృతిక వారసత్వం పరిరక్షింపబడడం...
News

అరుణాచల్‌లో అపూర్వమైన చీమలు

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని సియాంగ్‌ లోయలో అద్భుతమైన నీలి చీమలను పరిశోధకులు కనుగొన్నారు. బెంగుళూరుకు చెందిన అశోకా జీవావరణ, పర్యావరణ పరిశోధనా సంస్థ(అట్రీ), ఫెరిస్‌ క్రియేషన్స్‌లకు చెందిన సంయుక్త పరిశోధనా బృందం ఈ అరుదైన చీమల జాతిని కనిపెట్టింది. అపూర్వమైన జీవవైవిధ్యానికి నెలవైన సియాంగ్‌ లోయలో స్థానిక తెగలను అణచివేయడానికి 1912-1922లో బ్రిటిష్‌ వలస ప్రభుత్వం దండయాత్ర చేపట్టింది. ఆ దండు వెంట వెళ్లిన పరిశోధకులు సియాంగ్‌ లోయలోని ప్రతి మొక్క, బల్లి, కప్ప, చేప, పక్షి, పురుగు, క్షీరదాన్ని భారతీయ మ్యూజియం రికార్డుల కోసం నమోదు చేశారు. వందేళ్ల తరవాత బెంగుళూరు పరిశోధకుల బృందం మళ్లీ సియాంగ్‌ లోయకు వెళ్లి తిరిగి సర్వే చేసింది. అక్కడి మారుమూల యింకు గ్రామంలో ఒక చెట్టు తొర్రలో రెండు నీలి చీమలను కనుగొన్నారు. వాటికి ‘పారాపారాట్రెకినా నీల’ అని నామకరణం...
ArticlesNews

హిందూధర్మంలో సూర్య ఆరాధన

(జూన్ 5 - ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రత్యేకం ) సనాతన హిందూ ధర్మం జీవనాన్ని పరిరక్షించడంలో సూర్యుడు ఎంత కీలక పాత్ర పోషిస్తాడో తెలుసుకుని, ఈ మొత్తం విశ్వగమనానికి ప్రధాన సూత్రధారి ఆయన అని కీర్తించింది. వేదాల ప్రకాశాన్ని, శక్తిని...
News

భారత్‌ మాకు అనివార్య భాగస్వామి… ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి

భారత్‌ మాకు అనివార్య భాగస్వామి. అలాగే అత్యున్నత భద్రతా భాగస్వామి కూడా. ఇంతకు మునుపు ఎన్నడూ లేని విధంగా ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. వాస్తవానికి ఇండో పసిఫిక్‌లో ప్రయత్నాలను సాగించడానికి భారత్‌ మాకు ఇప్పుడు అనివార్య భాగస్వామి.అలాగే ఎలక్ట్రిక్‌...
News

ఐఎస్ఐఎస్ లింకుల కేసులో ఎన్ఐఏ చార్జిషీట్

నిషేధిత గ్లోబల్ టెర్రరిస్ట్ సంస్థ ISISకు చెందిన 17 మంది ఏజెంట్లపై NIA ఛార్జిషీట్లు దాఖలు చేసింది. విదేశీ హ్యాండర్లతో గ్లోబల్ లింకేజీని బహిర్గతం చేసిన కేసులో 2023 మార్చిలో ముగ్గురిపై ఛార్జిషీట్‌ దాఖలు చేసిన ఎన్‌ఐఏ సోమవారం ఢిల్లీ ప్రత్యేక...
ArticlesNews

లేపాక్షి వర్ణ చిత్రం… మనో రంజితం

అపురూప చిత్రాలు, శిల్పాలు చూసిన రసజ్ఞుడైన పర్యాటకుడి మనసు స్పందన నుంచి వచ్చిన మాటే... అద్భుతం. ఇంతటి అద్భుతానికి వేదికైంది ప్రపంచ వారసత్వ సంపదగా ఖ్యాతిగాంచింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని లేపాక్షి దుర్గావీరభద్రస్వామి ఆలయం. చిత్రకారుని కుంచె నుంచి జాలువారిన వర్ణ...
1 1,452 1,453 1,454 1,455 1,456 3,069
Page 1454 of 3069