సప్తర్షులు చూపిన జ్ఞానమార్గమే భారతీయ సంస్కృతికి దిక్సూచి : వెంకయ్య నాయుడు
సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా, లోకజ్ఞానాన్ని, సంస్కారాన్ని నేర్పించే గురువు స్థానం ఎప్పటికీ అమూల్యమైనదేనని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. అన్నమాచార్య భావనావాహిని ఆధ్వర్యంలో, డాక్టర్ శోభారాజు, నందకుమార్ నిర్వహణలో విజయవాడలోని కాకరపర్తి భావనారాయణ కళాశాల ప్రాంగణంలో...







