News

News

అయోధ్య ఆలయ దర్శన వేళల్లో మార్పు చేసిన ట్రస్ట్

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు పర్యాటకుల తాకిడి పెరిగింది. అయోధ్యలోని బాలరాముడి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ ఎక్కువైంది. రోజు రోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అయోధ్య రామమందిర ట్రస్ట్‌ రాములవారి దర్శన వేళలను గంటన్నర పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే సాధారణ దర్శనాన్ని ఇకపై గంట ముందుగా అంటే ఉదయం 6 గంటల నుంచే కల్పిస్తామని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తెలిపింది. రాత్రి 9.30 గంటలవరకు ఉన్న దర్శన వేళలను 10 గంటలవరకూ పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఇకపై ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులకు ఆలయం తెరిచి ఉంటుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ఉదయం 4 గంటలకు ‘మంగళ ఆరతి’ జరుగుతుంది. ఆ తర్వాత ఆలయ తలుపులు...
News

ప్రయాగ్‌రాజ్ రైలు స్టేషన్లలో సరైన ఏర్పాట్లు

జనవరి 13న మహా కుంభమేళ ప్రారంభమైనప్పటి నుండి గత 26 రోజుల్లో, 42 కోట్లకు పైగా యాత్రికులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసినట్టుగా ప్రాధమికంగా అధికారులు నిర్ధారించారు. దేశ, విదేశాల నుండి సందర్శకుల సంఖ్య పెరుగుతుండటంతో రైలు ప్రయాణం సజావుగా, సురక్షితంగా...
News

నాగార్జునకొండ అత్యద్భుతం

ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధ స్థావరం నాగార్జున కొండను సందర్శించిన అంతర్జాతీయ బౌద్ధ బిక్షువులు అక్కడి కట్టడాలు, శిల్పాలను కొనియాడారని పురావస్తు పరిశోధకుడు, ప్లీజ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈఓ, బుద్ధవనం కన్సల్టెంట్‌ డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. నాగార్జునసాగర్‌ లోని బుద్ధవనంలో ఈ...
News

చంద్రయాన్‌-3 ‘శివశక్తి’ పాయింట్‌కు భూమిపై జీవకోటికున్నంత వయసు

చంద్రయాన్‌-3 మిషన్‌తో భారత ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం ఈ మిషన్‌ చంద్రుడిపై నిద్రాణ స్థితిలోకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే..అందులో అమర్చిన పరికరాలు అందిస్తున్న సమాచారంతో ఇస్రో (ISRO) శాస్త్రవేత్తలు కొత్త ఆవిష్కరణల...
ArticlesNews

తిరుపరంకుండ్రం కొండ : చరిత్ర ఏమిటి? వర్తమాన వివాదమేమిటి? (భాగం 2)

మదురై ఆఖరి నవాబు సికందర్ షా – తిరుపరంకుండ్రం వివాదం : తిరుపరంకుండ్రం కొండ చరిత్రలో ఎన్నో సంక్షోభాలున్నాయి. ముస్లిముల ఆక్రమణలు, మతమార్పిడుల ఘర్షణలున్నాయి. సామాన్యశకం 1310-11 కాలంలో ఢిల్లీ సుల్తాన్ అలావుద్దీన్ ఖిల్జీ సైన్యాధ్యక్షుడు మాలిక్ కాఫుర్ దక్షిణ భారతదేశం...
News

కుంభమేళా గ్లామర్ వేడుక కాదు… మీడియాపై మహంత్ ధర్మేంద్రదాస్ ఆగ్రహం

మహాకుంభ మేళా సనాతన విశ్వాసానికి, సాధువులకు, భక్తులకు నిలయం. ఇది ఫైవ్ స్టార్ సంస్కృతిని ప్రతిబింబించే గ్లామర్ కూడలి కాదు. మీడియా అటువంటి విషయాలకే ఎక్కువగా ప్రచారం కల్పించడం సరికాదు" అని మహంత్ ధర్మేంద్రదాస్ అన్నారు. ఉదాసీన్ అఖాడా అధిపతి అయిన...
News

వైభవంగా ప్రారంభమైన శ్రీతిరుపతమ్మ అమ్మవారి పెద్ద తిరునాళ్లు

ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ అమ్మవారి పెద్ద తిరునాళ్లు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో కిషోర్ కుమార్ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అఖండ దీపం వెలిగించి తిరునాళ్లు అధికారికంగా ప్రారంభించారు. 45 రోజుల మండల దీక్షలు పూర్తి...
News

కనకదుర్గ అమ్మవారి ప్రసాదంలో వెంట్రుకలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకునేందుకు నిత్యం భారీగా భక్తులు తరలి వస్తుంటారు. దుర్గమ్మను దర్శించుకుని ఆలయంలో అందజేసే ప్రసాదాలు స్వీకరిస్తూ ఉంటారు. అయిత విజయవాడ దుర్గ గుడి ప్రసాదంలో వెంట్రుకలు కనిపించడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. ఓ భక్తుడికి ఇలాంటి...
News

మాఘ పౌర్ణమి.. మహా కుంభమేళాకు పోటెత్తిన భక్తులు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళాకు భక్తుల తాకిడి పెరిగింది. మాఘ పౌర్ణమి నేపథ్యంలో పుణ్యస్నానాలు చేసేందుకు లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమానికి తరలివస్తున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు గంగమ్మలో పతివ్ర స్నానాలు ఆచరిస్తున్నారు. మాఘ పౌర్ణమి వేళ...
ArticlesNews

మాహా మాఘం.. పుణ్యస్నానం

వెండి వెలుగుల పందిరి మాఘ పౌర్ణమి. చిమ్మ చీకటికి.. చంద్రుడు వెన్నెల వెలుతురుల తోరణాలు కడతాడు. అందుకే పౌర్ణమి నాటి రేయి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మన మనసులను ఆనందపరవశులను చేస్తుంది. మాఘ మాసంలో వచ్చే పున్నమినాడు చంద్రుడు పదహారు కళలతో...
1 856 857 858 859 860 2,479
Page 858 of 2479