News

రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్‌జీ మహారాజ్‌

229views

రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్‌ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్‌జీ మహారాజ్‌ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. గత నెలలో కోల్‌కతాలో మరణించిన మఠం అధ్యక్షుడు స్వామి స్మరణానందజీ మహారాజ్‌ వారసుడిగా గౌతమానంద్‌జీ బాధ్యతలు చేపట్టారు. మఠానికి సంబంధించిన ట్రస్టీల బోర్డు బుధవారం బేలూర్‌ మఠంలో సమావేశమై 95 ఏళ్ల గౌతమానంద్‌జీని నూతన అధ్యక్షుడిగా ఎన్నుకుంది.