News

అంతరిక్ష శకలాన్ని ఢీకొట్టకుండా తప్పించేందుకు.. 4 సెకండ్ల ఆలస్యంగా చంద్రయాన్‌ 3 ప్రయోగం

260views

గత ఏడాది చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి ఇస్రో విజయవంతంగా చేపట్టిన చంద్రయాన్‌-3 ప్రయోగానికి సంబంధించి ఒక ఆసక్తికర విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. చంద్రయాన్‌-3 మిషన్‌ను 4 సెకండ్ల ఆలస్యంగా ఇస్రో ప్రయోగించింది. ఓ అంతరిక్ష శకలాన్ని ఢీకొట్టకుండా తప్పించే ప్రయత్నంలో భాగంగా ఇలా చేసినట్టు ఇస్రో తాజా నివేదికలో పేర్కొన్నది. ఆర్బిటల్‌ కక్ష్యలో శాటిలైట్‌, శకలం ఒకదానికొకటి దగ్గరికి రాకుండా చేసే ప్రయత్నంతలో ఈ జాప్యం అనివార్యమైందని తెలిపింది. 60 ఏండ్లకు పైగా అంతరిక్ష కార్యకలాపాల వలన అంతరిక్షంలో వేలాది సంఖ్యలో శకలాలు తిరుగుతుంటాయన్న విషయం తెలిసిందే.