
259views
అంతర్జాతీయ సరిహద్దు గురించి అవగాహన లేక పొరపాటున మన దేశంలో ప్రవేశించిన పాక్ జాతీయుడిని సరిహద్దు భద్రత దళం (బీఎస్‌ఎఫ్) మానవతా దృక్పథంతో ఆదివారం పాక్ రేంజర్లకు అప్పగించింది. పంజాబ్‌లోని ఫాజిల్కా జిల్లాలో బీఎస్‌ఎఫ్ జవాన్లు ఈ వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. తనిఖీ చేసినప్పుడు అనుమానాస్పద వస్తువులేవీ లభ్యంకాలేదు.





