Articles

ArticlesNews

జయ జయ నృసింహ సర్వేశా

(మే 21 - నృసింహ జయంతి ) నృసింహావతారం ఇతర అవతారాల కంటే భిన్నమైనది. మహాభాగవతం పేర్కొన్న 21 అవతారాలలో ఇది 14వది కాగా, దశావతారాలలో నాలుగది. 'వదునాలుగవదియైన నరసింహ రూపంబున కనక కశిపుని సంహరించె' అన్నారు పోతనామాత్యులు. భగవంతుడు సర్వాంతర్యామి.ఇతర అవతారాల లక్ష్యం నెరవేరినంతనే శ్రీమహావిష్ణువు వైకుంఠానికితరలి వెళితే సర్వవ్యాపకుడైన నృసిహుండు భక్తపాలన కోసం ఇలలోనే ఉండిపోయాడు. నృసింహావతారం సర్వశక్తి సమన్విత స్వరూపం. త్రిమూర్తుల సమన్వయశక్తితో దనుజ సంహారానికి అవిర్భవించిన పరబ్రహ్మ స్వరూపం. 'ఇందుగల డందులేడని సందేహము వలదు/చక్రి సర్వోగతుందెం దుందు వెదకి చూచిన అందందే కలడు....' అన్న ప్రహ్లాదుడిని మాటలను నిజం చేస్తూ సర్వవ్యాపిత్వాన్ని చాటిన అవతారం. 'నృసింహావతారం త్రిమూర్త్యాత్మకం. పాదాల నుంచి నాభివరకు బ్రహ్మ రూపం, నాభి నుంచి కంఠవరకు విష్ణురూపం, కంఠం నుంచి శిరస్సు వరకు రుద్రస్వరూపంగా ఆధ్యాత్మికులు అభివర్ణిం చారు....
ArticlesNews

అలరించిన పంచరత్న గోష్టిగానం

‘ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.. చందురు వర్ణుని అంద చందమును హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు’... అంటూ సంగీత విద్వాంసులు త్యాగరాజస్వామి పంచరత్న కృతులను గోష్టిగానం చేసి శ్రోతలను పరమానంద భరితులను చేశారు. శ్రీ త్యాగరాజ స్వామి 257వ జయంత్యుత్సవాల్లో...
ArticlesNews

విభూతి ధారణ

నిత్యజీవితంలో ప్రతి ఒక్కరూ కోరుకునేవి కొన్ని ఉంటాయి. వాటిలో ఐశ్వర్యం ఒకటి ధన ధాన్యాదులు మాత్రమే ఐశ్వర్యం కాదు. వ్యక్తుల మనుగడ, ఉన్నతి, అభివృద్ధి, ఆధ్యాత్మిక ఆలోచనలు తదితరాలకు దోహదం చేసేవన్నీ ఐశ్వర్యాలే ఐశ్వర్యాన్ని విభూతి అంటారు. ఇది రెండు రకాలు- భూతి, విభూతి అని ఈ లోకంలో అనుభవానికి వచ్చే సంపదలను 'భూతి' అని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగించే ఆలోచనలను 'విభూతి' అని అంటారు. ఈ రెండు రకాల ఐశ్వర్యాలనూ ప్రసాదించేది భస్మ రూపంలో ఉండే విభూతి ధారణ. విభూతి ధారణ అపమృత్యు భయాన్ని తొలగించి శుభాలు కలగజేస్తుందని, సకల సంపత్కరమైనదని ఒక శ్లోకంలో చెప్పారు పౌరాణికులు. వేదాలు, పురాణాలు విభూతి ధారణ మహిమను ముక్త కంఠంతో చాటుతున్నాయి. భస్మ ధారణ చేసినవారికి దుష్ట గ్రహాలు, పిశాచ పీడలు, రోగాలు, పాపాలు దరిచేరవు. ధర్మబుద్ధి, బాహ్య...
ArticlesNews

స్వరాజ్య ఉద్యమ ప్రకాశం

(మే 20 - టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి) కొదమసింహంలా స్వాతంత్య్రం కోసం సమరం చేసిన మన కేసరి టంగుటూరి ప్రకాశంపంతులు. ఆయన మన మొదటి ముఖ్యమంత్రి. తుది వరకూ దేశం కోసం, జనం కోసం పరితపించిన తపస్వి. మద్రాసులో సైమన్ కమీషన్‌ను ఎదిరించిన సందర్భంలో తుపాకీకి రొమ్ము చూపించిన ఘనుడు. ఈయన దెబ్బకు తట్టుకోలేక వారే వెన్నుచూపించి వెళ్లిపోయారు. అందుకే ప్రకాశంను ‘ఆంధ్రకేసరి’ అని ప్రజలంతా గొంతెత్తి పిలుచుకున్నారు. గోపాలకృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు 23 ఆగస్ట్ 1872న ప్రకాశం పంతులు జన్మించారు. అతి సాధారణ కుటుంబంలో పుట్టి, ఆధునికాంధ్ర ప్రజానాయకుల్లో అసాధారణంగా ఎదిగి, ప్రజలే ప్రకాశం, ప్రకాశమే ప్రజలు అనిపించుకున్న నిస్వార్థ జీవి. ప్రకాశం జీవితం, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, స్వాతంత్ర్య ఉద్యమం వేరువేరు కావు. స్వాతంత్ర్య సమర యోధుడుగా ఎంతటి విజయాన్ని సాధించాడో, న్యాయవాదిగానూ వృత్తిలో...
ArticlesNews

భారత్ లో తగ్గిన హిందూ జనాభా, పొరుగుదేశాల్లో మాత్రం మరోలా…?

భారత్ లో హిందువుల వాటా గత కొన్ని దశాబ్దాలుగా తగ్గినట్టు ప్రధాని ఆర్థిక సలహా మండలి (పీఎమ్- ఈఏసీ) నేతృత్వంలో జరిపిన తాజా అధ్యయనంలో తేలింది. పొరుగు దేశాల్లో మాత్రం ఇందుకు భిన్నమైన గణాంకాలు నమోదు అయ్యాయి. అక్కడ మెజారిటీ మతస్తుల...
ArticlesNews

దేశీ గోమూత్రం పై పేటెంట్ భారత్ దే, బాగా కృషి చేసిన “గో విజ్ఞాన్ అనుసంధాన కేంద్రం”

మన భారత దేశ ఆధారభూతమైన విషయాలపై చాలా మంది పేటెంట్‌ హక్కులు పొందాలని సర్వదా ప్రయత్నాలు చేస్తుంటారు. భారతీయులు బాగా ఆరాధించే వేప చెట్టుపై విదేశీయులు పేటెంట్‌ పొందారు. దీనిని గమనించిన నాగపూర్‌ పట్టణానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో వున్న...
ArticlesNews

పోగొట్టుకున్న చోటే…

ఒక వృద్దుడు రాత్రి సమయంలో రహదారిపై ఏదో వెతుకుతున్నాడు. దాన్ని గమనించిన యువకుడు సహాయం చేయడానికి వచ్చి 'తాతా, ఎం. వెతుకుతున్నావు?' అని అడిగాడు బాబూ, నా అయిదు రూపాయల నాణెం పడిపోయింది.ఎంత వెతికినా దొరకడం లేదు' అన్నాడు.'తాత ఎక్కడ పడింది"...
ArticlesNews

తెలుగు భాషకు చిరస్మరణీయ సేవలందించిన భాషా సేవకుడు కొమర్రాజు లక్ష్మణరావు

(మే 18 - కొమర్రాజు వెంకట లక్ష్మణరావు జయంతి) తెలుగు భాషకు చిరస్మరణీయ సేవలందించిన భాషా సేవకుడు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. తెలుగులో చరిత్ర పరిశోధనలు, విజ్ఞాన రచనలు చేయడానికి తొలి అడుగులు వేసినవారు. నిద్రాణమై ఉన్న తెలుగు జాతిని మేల్కొలిపిన మహనీయుల్లో ఎన్నదగిన వారు. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు క్రీ.శ. 1876 మే 18న ఉమ్మడి కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలో జన్మించారు.విద్యార్థిగా ఉన్నపుడు 'సమాచార్','వివిధ విజ్ఞాన్ విస్తార్' వంటి మరాఠి పత్రికలకు సంపాదకత్వ బాధ్యతలు వహించారు. 'కేసరి', 'మహారాష్ట్ర' వంటి పత్రికలకు విరివిగా వ్యాసాలు రాశారు. అనేక చర్చల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. తెలుగులో 'జనరంజని' పత్రిక స్వయంగా నడిపించారు. విజయవాడలో స్త్రీ విద్యావ్యాప్తి 'తెలుగు జనానా' పత్రికలో సోదరి బండారు అచ్చమాంబతో కలిసి అనేక రచనలు చేశారు. హైదరాబాదులోని 'శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం' స్థాపించడంలోనూ;...
ArticlesNews

మన సత్తాపై ‘అణు’మానాలు తీరిన రోజు

(మే18- పోఖ్రాన్‌-1 పరీక్షకు 50 ఏళ్లు) భారత్‌ అణు బాంబు తయారుచేస్తే గడ్డి తిని.. అవసరమైతే పస్తులుండైనా మేమూ అణు బాంబును తయారుచేస్తాం. అంటూ భారత్‌ పరీక్షలు నిర్వహించడానికి 9 ఏళ్ల ముందే ప్రకటించిన పాక్‌.. ఆ దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టింది. 1974 మే 18 భారత దేశ చరిత్రలో ఇది చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. ప్రపంచ యవనికపై మన దేశం సాంకేతిక సత్తా చాటిన రోజు. యుద్ధోన్మాదంతో రగిలిపోతున్న పొరుగు దేశాలకు గట్టి సందేశం పంపిన రోజు. సరిగ్గా 50 ఏళ్ల కిందట ఇదే రోజు భారత్‌ తన తొలి అణు పరీక్షను నిర్వహించింది. తద్వారా ఆ సత్తా చాటిన అమెరికా, సోవియట్‌ యూనియన్, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాల సరసన సగర్వంగా నిలిచింది. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వంలేని దేశం అణు పరీక్ష...
ArticlesNews

18 నుంచి సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవాలు

సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుడే అనంతలక్ష్మీ సత్యవతీదేవి సమేతుడై వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రంగా అన్నవరం ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ పావన పంపా నదీ తీరాన రత్నగిరిపై వెలసిన భక్తవరదుడు.. శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామి వారి వార్షిక దివ్యకల్యాణ మహోత్సవాలకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి....
1 … 227 228 229 230 231 … 351
Page 229 of 351