Articles

ArticlesNews

శిథిలావస్థకు చేరిన పురాతన దేవాలయాలు

బాపట్ల జిల్లా బల్లికురవ మండలంలోని కొణిదెన గ్రామంలో ఉన్న క్రీస్తు శకం 11వ శతాబ్దపు నాటి పురాతన దేవాలయాలు ఇప్పుడు శిథిలావస్థకు చేరాయి. కొంత కాలానికి పూర్తిస్థాయిలో కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.ప్రసిద్ధ దేవాలయాల గురించి ఎన్ని మార్లు ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టీపట్టనట్లు ఉన్నారని వారు అరోపిస్తున్నారు. బల్లికురవ మండలం అంటే గుర్తుకు వచ్చేది చోళరాజులు పరిపాలించిన కొణిదెన గ్రామం. ఇక్కడ అప్పట్లో రాజులు 101 బావి, కోటి ఒక్క శిలను ప్రతిష్టించారు. అప్పట్లోనే గ్రామంలో రోజులు వేణుగోపాలస్వామి, చెన్నకేశవస్వామి దేవాలయాలను ప్రతిష్ఠించారు. వందల సంవత్సరాల కిందట ఏర్పాటు చేసిన రెండు దేవాలయాలు ఇప్పుడు శిథిలావస్థకు చేరాయి. అలానే ఈ గ్రామంలో ఎన్నో శాసనాలు కూడా ఉన్నాయి. పలుమార్లు పురావస్తు శాఖ అధికారులు కూడా ఈ గ్రామాన్ని సందర్శించి ప్రసిద్ధ దేవాలయాలను అభివృద్ధి చేస్తామని...
ArticlesNews

భారతీయనారి హిందూ కుటుంబానికి ఆధారం

మైత్రేయి. క్రీ.పూ 8వ శతాబ్దానికి చెందిన స్త్రీ ఆ రోజు మన దేశంలో స్త్రీలకున్న విద్యావకాశాలను చక్కటి ఉదాహరణ. ఆమె భారతీయ మహిళా మేధావులలో అగ్రగణ్యురాలు. జనకుడేలిన మిథిల ఆస్థానంలో మైత్రేయి తండ్రి మైత్రి పనిచేస్తుండేవాడు. జనకుడికి అద్వైతం గురించి చెప్పిన...
ArticlesNews

సామాజికపద పితామహుడు అన్నమయ్య

(తాళ్ళపాక అన్నమాచార్యుల 616వ జయంతి ఉత్సవాల సందర్భంగా…) అన్నమయ్య… ఈ పేరు వినగానే మనకు గొప్ప వాగ్గేయకారుడని, మహాభక్తుడని, సంకీర్తనాచార్యుడని ఆంధ్రపదకవితా పితామహుడుని మాత్రమే గుర్తుకు వస్తుంది తప్ప ఆయనలోని సామాజికతను తలచుకునేవారు చాలా తక్కువ. ఆయన పదాలను విశ్లేషించి చూస్తే...
ArticlesNews

తొలి వార్తాహరుడు, ఆదర్శ పాత్రికేయుడు నారదుడు

( మే 24 - నారద జయంతి ) నారదుడు దేవర్షి, సంగీతజ్ఞుడు, నిరంతర లోక సంచారి. ఆయన ఒక ”ఆదర్శ పాత్రికేయుడు”. మంచిచెడుల మధ్య జరిగే యుద్ధంలో ఆయనది ఎప్పుడూ ధర్మ పక్షమే. కృత, త్రేతా, ద్వాపర యుగాలన్నిటిలోనూ ఆయన...
ArticlesNews

అ‘ద్వితీయం’ కూర్మావతారం

( మే 23 - కూర్మ జయంతి ) శ్రీమహావిష్ణువు ధరించిన ప్రసిద్ధ అవతారాలలోని అ'ద్వితీయం' కూర్మావతారం. దేవదానవులు క్షీరసాగరంలో అమృత మథనానికి యత్నించినప్పుడు కవ్వమైన మంధర గిరి సాగరజలాల పాలుకాకుండా కాపాడేందుకు హరి కూర్మరూపుడిగా అవతరించాడు. దానవుల చేతిలో పరాజితులైన...
ArticlesNews

విశ్వశాంతి స్వరూపుడు గౌతమబుద్ధుడు

( మే 23 - బుద్ధ పూర్ణిమ ) మానవ అస్తిత్వం, ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన విశిష్ట స్పృహతో ఉన్న కొంతమంది వ్యక్తులు చరిత్రలోని విభిన్న మలుపుల్లో మొత్తం మానవాళికి సంబంధిత కాలాలకు సంబంధించిన కొత్త మార్గాన్ని చూపుతూ వచ్చారు. అటువంటి...
ArticlesNews

భావితరాలకు ఎనలేని సాహిత్య సంపాదను అందించిన తరిగొండ వెంగమాంబ

తరిగొండ వెంగమాంబ తన రచనల ద్వారా భావితరాలకు ఎనలేని సాహిత్య సంపదను అందించిందని జేఈఓ శ్రీమతి గౌతమి ఉద్గాటించారు. శ్రీవారి అపర భక్తురాలైన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 294వ జ‌యంతి ఉత్సవాలు మంగ‌ళ‌వారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, తరిగొండ వెంగమాంబ శ్రీవారిపై భక్తి శ్రద్ధలతో అనేక సంకీర్తనలు రచించారన్నారు. వెంగమాంబ సాహిత్యాన్ని, రచనలు, కీర్తనలను జన బాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు టీటీడీ కృషి చేస్తోందన్నారు. ముత్యాల హారతి రూపంలో శ్రీ‌వారిలో ఐక్యమైనారన్నారు. అనంత‌రం జ‌రిగిన సాహితీ సదస్సుకు అధ్యక్షత వహించిన అనంతపురం ఎస్‌కె వర్సిటీ మాజీ ఉపకులపతి డా.కుసుమకుమారి మాట్లాడుతూ, వెంగమాంబ ఎన్నో రచనలు చేసినా ఆమె రచనలకు గుర్తింపు రాలేదన్నారు. టీటీడీ త‌రిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ఏర్పాటు చేసి ఆమె సాహిత్యాన్ని, ర‌చ‌న‌ల‌ను వెలుగులోకి తీసుకొని...
ArticlesNews

శివాజీ నిర్భీతి

భయం ఒక అదృశ్యశక్తి. అది చాలా రకాలుగా బయటపడుతూఉంటుంది.అందుకనే పతంజలి మహర్షి‘‘నిర్భయత్వం సన్యాసి లేదా సాధకుడి ముఖ్యలక్షణం’’అన్నాడు. శివాజీలో ఆ నిర్భయత్వం కనబడుతుంది. రాజాజయ సింగ్‌ను కలవడానికి వెళ్ళినప్పుడు ఒప్పందం ప్రకారం శివాజీ నిరాయుధుడై, కేవలం ఆరుగురు బ్రాహ్మణులను వెంటబెట్టుకుని వెళ్ళాడు....
ArticlesNews

జయ జయ నృసింహ సర్వేశా

(మే 21 - నృసింహ జయంతి ) నృసింహావతారం ఇతర అవతారాల కంటే భిన్నమైనది. మహాభాగవతం పేర్కొన్న 21 అవతారాలలో ఇది 14వది కాగా, దశావతారాలలో నాలుగది. 'వదునాలుగవదియైన నరసింహ రూపంబున కనక కశిపుని సంహరించె' అన్నారు పోతనామాత్యులు. భగవంతుడు సర్వాంతర్యామి.ఇతర అవతారాల లక్ష్యం నెరవేరినంతనే శ్రీమహావిష్ణువు వైకుంఠానికితరలి వెళితే సర్వవ్యాపకుడైన నృసిహుండు భక్తపాలన కోసం ఇలలోనే ఉండిపోయాడు. నృసింహావతారం సర్వశక్తి సమన్విత స్వరూపం. త్రిమూర్తుల సమన్వయశక్తితో దనుజ సంహారానికి అవిర్భవించిన పరబ్రహ్మ స్వరూపం. 'ఇందుగల డందులేడని సందేహము వలదు/చక్రి సర్వోగతుందెం దుందు వెదకి చూచిన అందందే కలడు....' అన్న ప్రహ్లాదుడిని మాటలను నిజం చేస్తూ సర్వవ్యాపిత్వాన్ని చాటిన అవతారం. 'నృసింహావతారం త్రిమూర్త్యాత్మకం. పాదాల నుంచి నాభివరకు బ్రహ్మ రూపం, నాభి నుంచి కంఠవరకు విష్ణురూపం, కంఠం నుంచి శిరస్సు వరకు రుద్రస్వరూపంగా ఆధ్యాత్మికులు అభివర్ణిం చారు....
ArticlesNews

అలరించిన పంచరత్న గోష్టిగానం

‘ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.. చందురు వర్ణుని అంద చందమును హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు’... అంటూ సంగీత విద్వాంసులు త్యాగరాజస్వామి పంచరత్న కృతులను గోష్టిగానం చేసి శ్రోతలను పరమానంద భరితులను చేశారు. శ్రీ త్యాగరాజ స్వామి 257వ జయంత్యుత్సవాల్లో...
1 226 227 228 229 230 350
Page 228 of 350