News

రాజస్థాన్‌లో ‘లవ్ జిహాద్’కు అడ్డుకట్ట : సీఎం భజన్‌లాల్ శర్మ

4views

రాజస్థాన్: రాజస్థాన్‌లో ‘లవ్ జిహాద్’ సమస్యను తమ ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తోందని ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ పేర్కొన్నారు. జైపూర్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలకు తమ ప్రభుత్వం అడ్డుకట్ట వేసిందని ఆయన అన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని ఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మతమార్పిడులను అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు.

మతమార్పిడికి సంబంధించిన అంశాలను నియంత్రించేందుకు తమ ప్రభుత్వం మతమార్పిడి నిరోధక చట్టాన్ని అమలు చేసిందని భజన్‌లాల్ శర్మ పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలు, యువత భద్రతకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు.