
969views
ఈ రోజు అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతుందని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. సంకట సమయంలో దేశమంతా ఒక్కటిగా నిలిచిందని.. భారతీయులు జనతా కర్ఫ్యూని విజయవంతం చేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. ‘కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రజలందరూ సామాజిక దూరం పాటించాలి. ఒకరికొకరు దూరంగా ఉంటూ ఇళ్లలోనే ఉండాలి. ఈ విధంగా ఉంటే తప్ప ఈ గండం నుంచి గట్టెక్కే పరిస్థితి లేదు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా నిస్సహాయ స్థితిలో నిలిచిపోయాయి. కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సవాలు విసురుతూనే ఉంది. కరోనా వ్యాప్తి ఎలా విస్తరిస్తుందో వార్తల్లో చూస్తున్నాం’ అని ప్రధాని మోదీ వివరించారు.





