
782views
రాంచీ మసీదులో బస చేస్తున్న విదేశాలకు చెందిన 11 మంది మౌల్వీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వివిధ దేశాల నుండి 11 మంది మౌల్విలు (ఇస్లామిక్ పండితులు) జార్ఖండ్‌లోని రాంచీ జిల్లాలో గల తమర్ నగరానికి సమీపంలోని రాగావ్ గ్రామంలో గల ఒక మసీదులో బస చేశారు.
చైనా, కజకస్థాన్, కిర్గిజ్ స్థాన్ మరియు ఇతర దేశాల నుండి వచ్చిన 11 మంది మౌల్వీలు మసీదులో ఉంటున్నట్లు బుండు డిఎస్పికి ఈరోజు సమాచారం అందింది.
బుండు డిఎస్పీ, తన బృందంతో కలిసి మసీదుపై దాడి చేయగా, 11 మంది మౌల్వీలను అరెస్టు చేసి ముసాబని పోలీసు శిక్షణా కేంద్రంలో దిగ్బంధం (క్వారంటైన్) కోసం పంపారు.
వారికి కరోనా పాజిటివ్ వచ్చినట్లయితే ఇంకా స్పష్టం కాలేదు.
పోలీసులు వారి పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకుని ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.
Source : India Today.





