News

ముంచుకు రానున్న మరో చైనా వైరస్?

118views

ప్రపంచమంతా కరోనా వైరస్‌ను ఎలా కట్టడి చేయాలా అని బాధపడుతోంది. దేశాలన్నీ క్రమంగా లాక్‌డౌన్‌ అవుతున్నాయి. మూడో దశలోకి చేరితే పరిస్థితేంటా అని భయపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చైనాలో మరో వైరస్‌తో ఓ వ్యక్తి మృతిచెందడం అందరినీ కలవపరుస్తోంది. ఆ వైరస్‌కు టీకామందు ఉండటం ఊరట కలిగించే అంశం.

చైనాలోని యున్నన్‌ ప్రావిన్స్‌లో ఓ వ్యక్తి హంటా వైరస్‌తో మృతిచెందాడు. ఈ విషయాన్ని ఆ ప్రభుత్వ మీడియా సంస్థ ‘గ్లోబల్‌ టైమ్స్‌’ ట్విటర్‌ ద్వారా తెలియజేసింది. సోమవారం షాండోగ్‌ ప్రావిన్స్‌లో బస్సులో ప్రయాణిస్తుండగా అతడు చనిపోవడం గమనార్హం. ఈ వైరస్‌ లక్షణాలు సైతం ఫ్లూ, కరోనాని పోలివుండటం గమనార్హం.

మరణాలు అనేకం

విస్తుగొలిపే మరో విషయం ఏంటంటే చైనాలో 1950 నుంచి 2007 మధ్య హంటా వైరస్‌తో 46,000 మంది మృత్యువాత పడ్డారు. 15 లక్షల మందికి ఈ వైరస్‌ సోకింది. 2005-2010 మధ్య ఫిన్లాండ్‌లో 32వేల మందికి హంటా సోకింది. రష్యాలో 1996 నుంచి 2006 మధ్య 90,000 కేసులు నమోదయ్యాయి.

ఇలా సోకుతుంది

హంటా వైరస్‌ ముఖ్యంగా ఎలుకలు, మూషిక జాతి జీవుల ద్వారా వ్యాప్తిస్తుంది. ఉదాహరణకు ఎలుకల మలం, మూత్రం, లాలాజలం కలిసిన గాలిని పీల్చుకుంటే ఈ వైరస్‌ సోకుంది. అయితే మనిషికి సోకిన తర్వాత మరో మనిషికి ఇది అంటుకోదు. అమెరికాలో దీనిని ‘న్యూ వరల్డ్‌’ హంటా వైరస్‌ అని, ఐరోపా, ఆసియాలో ‘ఓల్డ్‌ వరల్డ్‌’ హంటా వైరస్‌ అని అంటారు. న్యూ వరల్డ్‌తో హంటావైరస్‌ ఫల్మనరీ సిండ్రోమ్‌ (హెచ్‌పీఎస్‌), ఓల్డ్‌ వరల్డ్‌తో హెమోరాజిక్‌ ఫీవర్‌ విత్‌ రీనల్‌ సిండ్రోమ్‌ (హెచ్‌ఎఫ్‌ఆర్‌ఎస్‌) వ్యాపిస్తుంది.

లక్షణాలు

హెచ్‌పీఎస్‌ : ముందు అలసట, జ్వరం, కండరాల నొప్పి (మరీ ముఖ్యంగా తొడలు, పిరుదులు, కొన్నిసార్లు భుజాల్లో), తలనొప్పి, బద్దకం, తిమ్మిర్లు, ఉదర ఇబ్బందులు ఉంటాయి. పది రోజుల తర్వాత దగ్గు, ఊపిరి పీల్చుకోకపోవడం ఉంటుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.