News

కరీంనగర్లో ఉదృతంగా పీఎఫ్ ఐ కార్యకలాపాలు?

679views

రీంనగర్లోని ముకరంపుర ప్రాంతంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ పేరుతో నడుస్తున్న ఒక విద్యాసంస్థలో యువకులకు తీవ్రవాద శిక్షణను ఇస్తున్నట్లుగా తేలింది.

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలలో  పోలీసులు విద్యాసంస్థల మూసివేత విషయంలో జరుపుతున్న తనిఖీలలో భాగంగా ముకరంపుర లోని ఈ విద్యా సంస్థను పరిశీలించినప్పుడు ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా అక్కడ తరగతులను నిర్వహిస్తున్నట్టు తేలింది.

ఆ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు జమీల్ అహమద్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీ ఎఫ్ ఐ) జిల్లా నాయకుడని తెలుసుకున్న పోలీసులు విస్మయం చెందారు.

కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పీ ఎఫ్ ఐ ని నిషేధించి ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. ఈ సంస్థలో తరగతులకు హాజరవుతున్న కొంతమంది విద్యార్థులను కూడా పీ ఎఫ్ ఐ కార్యకలాపాలలో పనిచేసే విధంగా తయారుచేసి బెంగుళూరు ప్రాంతానికి తరలించినట్లుగా తమ ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. ఈ దాడిలో ఎస్ ఐలు స్వరూప్ రాజ్, రవీందర్ నాయుడుల తోపాటుగా వివిధ విభాగాలకు చెందిన పోలీసులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.