
937views
ఈ రోజు ఒంగోలు మాధవ సేవాసమితి ఆధ్వర్యంలో కేశవభవన్ కార్యాలయంలో కరోనా వ్యాధి నివారణ కొరకు మహిళలకు అవగాహన కల్పించి ,ముందు జాగ్రత్త కొరకై హోమియో మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షలు శ్రీ మండవ నాగేశ్వరరావు గారు, సభ్యులు శ్రీ మక్కపాటి వెంకటేశ్వరరావు, శ్రీకోలగట్ల వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు. సుమారు 300 మంది గృహిణులకు వారి ఇంటిల్లపాదికీ సరిపడా మందులు పంపిణీ చేశారు. కరోనా కారణంగా భయానక వాతావరణం నెలకొన్న ప్రస్తుత పరిస్థితులలో మాధవ సేవా సమితి తమకు అండగా నిలిచి ధర్యాన్నిస్తోందని మందులు అందుకున్న గృహిణులు హర్షం వ్యక్తం చేశారు.






