NewsProgramms

శ్రీరామనవమి సందర్భంగా గుంటూరులో జరుగనున్న భారీ బైక్ ర్యాలీ

401views

శ్రీరామనవమి సందర్భంగా గుంటూరులో భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నామని శ్రీరామ ఉత్సవ సమితి నిర్వాహకులు తెలియజేశారు. ఏప్రిల్ 2వ తారీఖున 9 గంటలకు గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి ఈ ర్యాలీ బయలుదేరుతుందని వారు తెలిపారు. గత నాలుగు సంవత్సరాలుగా తాము ప్రతి శ్రీరామనవమికీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఈ భారీ బైక్ ర్యాలీని గుంటూరు ప్రజలు, ముఖ్యంగా యువత విజయవంతం చేయాలని వారు కోరారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.