ArticlesNews

భోజశాల తీర్పుకు అయోధ్య స్ఫూర్తి

27views

భోజశాల కేసులో మధ్యప్రదేశ్‌ ‌హైకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది. ఆ ప్రదేశం వాగ్దేవికి అంకితమైన హిందూ ఆలయమని ప్రకటించింది. అక్కడ పూజలు చేసే ప్రత్యేక హక్కును హిందువులకు కల్పించింది. ఈ తీర్పును ఇవ్వడంలో రామ జన్మభూమి కేసు (అయోధ్య తీర్పు)లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రధానంగా చేసుకుంది. రామ జన్మభూమి కేసులో (న్యాయస్థాన రికార్డులలో చట్టపరమైన ప్రతినిధుల ద్వారా ఎం. సిద్ధిఖ్‌ ‌వర్సెస్‌ ‌మహంత్‌ ‌సురేష్‌ ‌దాస్‌; ఇతరులుగా నమోదైనది) సుప్రీంకోర్టు తీర్పు నుండి వెలువడిన 10 సూత్రాలను హైకోర్టు న్యాయ మూర్తులు గుర్తించారు. వాటిని వివరించారు. ఎందుకంటే, సంబంధిత పక్షాలన్నీ ఏదో ఒక సందర్భంలో ఈ తీర్పునే ప్రాతిపదికగా తీసుకు న్నాయి. ఆ సూత్రాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

  • ఇలాంటి కేసును గణితపరమైన నిశ్చయం లేదా సహేతుకమైన సందేహానికి అతీతమైన రుజువుతో బేరీజు వేయరాదు. కానీ న్యాయస్థానాలు అంగీకరించాల్సిన ప్రమాణం సంభావ్యత ప్రాబల్యం. ఇది సివిల్‌ ‌విచారణలలో కూడా ఆమోదించిన ప్రమాణం.
  • కట్టడం ఆధ్యాత్మికత పరిపూర్ణతను నిర్ధారిం చడం కోసం ఆధునిక న్యాయస్థానాలు విచారణ చేపట్టరాదు. బదులుగా విశ్వాసం, నమ్మకం, ఆరాధన, దానధర్మాల కొనసాగింపు, దానం స్వభావం, అది శాశ్వతంగా ఉందా లేదా, ధార్మిక ఉపయోగం, ఆరాధకుడి ప్రవర్తన, చారిత్రక వాదన, ధార్మిక విశ్వాసం కొనసాగింపు, సుస్థిరతకు సంబంధించిన సాక్ష్యాలను నిర్ధారించేలా విచారణ ఉండాలి.
  • దైవాన్ని, దానధర్మాల ద్వారా సంక్రమించిన ఆస్తిని, దాని వెనుక ఉన్న పవిత్ర ఉద్దేశ్యాన్ని పరిరక్షించడమే ఆధునిక న్యాయస్థానాల పరమ లక్ష్యం. అపరిచితుడి నుండి దైవం ప్రయోజనాల పరిరక్షణకు సంస్థాగతమైన చర్యలు చేపట్టేందుకు భక్తులకు అనుమతి ఇవ్వవచ్చు.
  • దైవానికి ఒక హిందువు చేసే దానం పవిత్రతను కలిగి ఉంటుంది. అది సార్వత్రికమైనది, అనంతమైనది, సర్వవ్యాపకమైనది. దానిని భౌతిక లేదా చట్టపరమైన హద్దులతో బంధించలేము. విగ్రహం ధ్వంసమైనా కాకపోయినా, పూర్తిగా లేకపోయినా, దేవదాయంతో చట్టబద్ధమైన యజమాని (శ్రీరాముడు) ద్వారా ఆ పుణ్యకార్యం కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే, చట్టం రక్షించేది భౌతికమైన విగ్రహాన్ని కాదు, నిరంతర ఆరాధన అనే అంతర్లీనమైన పుణ్యకార్యాన్ని. ఆధునిక న్యాయ స్థానాలకు పుణ్యకార్యాన్ని పరిరక్షించడం అత్యవసరం. నిరంతర ఆరాధన ద్వారా అంకితభావపు ఉద్దేశ్యాన్ని నెరవేర్చడమే లక్ష్యంగా ఉండాలి, తద్వారా భక్తులు ప్రార్థన ద్వారా ఆధ్యాత్మిక పరిపూర్ణతను పొందగలరు. హిందూ విగ్రహాల విషయంలో, చట్టబద్ధమైన సాధికారత విగ్రహానికి కాకుండా, విగ్రహంలో అవతరించిన దైవాన్ని నిరంతరం ఆరాధించాలనే అంతర్లీన పుణ్యకార్యానికి ఇవ్వడం జరుగుతుంది. హిందూ భక్తుల విశ్వాసం, నమ్మకం వారి మనస్సాక్షికి సంబంధించిన వ్యక్తిగత విషయం. అటువంటి పవిత్రమైన ఉద్దేశ్యాలకు ప్రాధాన్యత, భద్రత కల్పించడానికి, అటువంటి నమ్మకాలు సదుద్దేశంతో ఉన్నాయో లేదో నిర్ధారించడానికి చేసే ప్రాథమిక పరిశీలనకు మించి వారి దృఢ విశ్వాసాల బలాన్ని గానీ, వారి నమ్మకాల హేతుబద్ధతను గానీ న్యాయస్థానం పరిశీలించాల్సిన అవసరం లేదని తీర్పు చెప్పింది.
  • విశ్వాసం, నమ్మకం అత్యంత ప్రాముఖ్యమైనవిగా గుర్తించింది. అయితే, వాటిని ఎల్లప్పుడూ ప్రత్యక్ష పత్రరూప సాక్ష్యాలతో నిరూపించలేమని, అలాగే అవి ఎల్లప్పుడూ లౌకిక తర్కానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని కూడా న్యాయస్థానాలు గుర్తించాలి. విశ్వాసం, నమ్మకం అనేవి విశ్వసించే వారే. వ్యక్తిగత పరిధిలో ఉంటాయి. వాటి యథార్థతను గ్రంథ వ్యాఖ్యానం లేదా హేతుబద్ధమైన పరిశీలనతో పరీక్షించలేమని న్యాయస్థానం స్పష్టం చేస్తుంది. పరీక్ష వాస్తవాలకు సంబంధించినదిగా ఉండాలి కానీ హేతుబద్ధతకు కాదు. విశ్వాస విషయాలలో సాక్ష్యం లేకపోవడాన్ని విశ్వసించేవారికి ప్రతికూలంగా పరిగణించకూడదు. యాజమాన్య హక్కులను నిర్ధారించేటప్పుడు విశ్వాసం, నమ్మకంలో సుస్థిరత, నిరంతరత అనేవి పరిగణించదగిన అంశాలు. ఒక ధార్మిక శాఖ ఆధ్యాత్మిక ప్రపంచంలోని ఒక నిర్దిష్ట వాస్తవం అస్తిత్వాన్ని స్థిరంగా, నిరంతరంగా విశ్వసిస్తుంది. అలాంటి విశ్వాసం చేసే వాదనను రికార్డులోని ఇతర సంబంధిత ఆధారాల ద్వారా బలపరచినట్టయితే, అప్పుడు న్యాయస్థానాలు పోటీ విశ్వాసాల బలాన్ని పోల్చి విషయాన్ని నిర్ణయించ కూడదు. అంతేకాకుండా ఆ నమ్మకం యథార్థతను అంచనా వేయాలి.
  • అధికారిక గెజెట్‌లు లేదా గెజెటియర్‌లు అగ్రాహ్యమైనవి లేదా అసంబద్ధమైనవి కానప్పటికీ, వాటిని న్యాయస్థానానికి చారిత్రక నేపథ్యాన్ని అందించడానికి పరిగణించవచ్చు. వాటిని ఇతర ఆధారాలతో బలపరిచినప్పుడు అవి నిర్ధారణ విలువను కూడా కలిగి ఉండవచ్చు. అయినప్పటికీ, వాటిని యాజమాన్య హక్కు, ధార్మికమైన స్వభావం, చట్టపరమైన అర్హత లేదా వివాదాస్పద చారిత్రక వాస్తవానికి నిశ్చయాత్మకమైన రుజువుగా పరిగణించలేము. వాటిలోని విషయాలను సమకాలీన పత్రాలు, అధికారిక రికార్డులు, పురావస్తు ఆధారాలు, పార్టీల ప్రవర్తన, ఇతర పరిసర పరిస్థితులు సహా మొత్తం రికార్డుతో సరిపోల్చి నిశితంగా పరిశీలించాలి.
  • పరస్పరం పోటీపడే ధార్మిక వర్గాల మధ్య తలెత్తే ఇలాంటి వివాదాలలో, ఆధునిక న్యాయస్థానాలు అధికారిక ప్రభుత్వ రికార్డులను అంచనా వేయడంలో అయోధ్య తీర్పు ఒక మార్గదర్శిగా నిలుస్తుంది. అధికారిక వివరణలు, పరిపాలనా నామకరణం, ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు, సమకాలీన అధికారిక రికార్డులు, ఒక వివాదాస్పద ప్రదేశాన్ని దాని ధార్మికపరమైన లేదా చారిత్రక సంబంధం ఆధారంగా స్థిరంగా గుర్తించినప్పుడు, అవి గణనీయమైన సాక్ష్య విలువను కలిగి ఉండవచ్చు. అటువంటి సమాచారం దానంతట అదే యాజమాన్య హక్కును లేదా తుది చట్టపరమైన స్వరూపాన్ని నిర్ధారించకపోవచ్చు. కానీ అది ఇతర పత్రరూప, చారిత్రక, పురావస్తు, ఆరాధనకు సంబంధించిన సాక్ష్యాలను గణనీయంగా బలపరచగలదు.
  • హిందూ పక్షం వారు భూమికి న్యాయపరమైన సాధికారత రూపంలో లేదా ముస్లిం పక్షం వారు వివాదాస్పద ఆస్తి మొత్తంపై వినియోగ వక్ఫ్ ‌రూపంలో ప్రస్తావించిన అంతర్గత ధార్మిక సిద్ధాంతాలను ఇతర వర్గం స్థిరపరుచుకున్న ధార్మిక హక్కులను స్వయంచాలకంగా నాశనం చేసే విధంగా అంగీకరించలేమని అయోధ్య తీర్పు స్పష్టం చేస్తుంది. రామ జన్మభూమి అనే భూమియే ఒక న్యాయపరమైన వ్యక్తి అనే వాదనను, అలాగే వివాదాస్పద ఆస్తి మొత్తం వినియోగ వక్ఫ్ ‌కిందకు వస్తుందనే వాదనను కూడా కోర్టు తిరస్కరించింది. ఎందుకంటే, అటువంటి గుర్తింపు అదే ఆస్తిపై పోటీ పడుతున్న హిందూ ధార్మిక హక్కులను హరించివేసి ఉండేది.
  • ఏఎస్‌ఐ అనేది గుర్తింపు పొందిన విశ్వసనీయత, నైపుణ్యం కలిగిన సంస్థ, ఇలాంటి లక్షణాలు ఆధునిక న్యాయస్థానాలకు లేవు. కాబట్టి దాని నివేదికలకు తగిన విలువ ఇవ్వాలి. రామ జన్మభూమి కేసులో నివేదికను మూల్యాంకనం చేయకపోవడంలో హైకోర్టు అనుసరించిన విధానాన్ని సుప్రీంకోర్టు సమర్థించలేదు. అయినప్పటికీ, దాని పద్ధతి, నిర్ధారణలపై వచ్చిన విమర్శలను దృష్టిలో ఉంచుకోవడం అవసరం. ఆర్డర్‌ 26 ‌రూల్‌ 10(2) ‌ప్రకారం, కమిషనర్‌ ‌చేపట్టిన నివేదిక, సాక్ష్యం ‘‘దావాలో సాక్ష్యంగా ఉండాలి’’,‘‘రికార్డులో భాగంగా ఉండాలి’’ అని కోర్టు పేర్కొంది. ఒక న్యాయస్థానం నిపుణుడిగా వ్యవహరించి, కమిషనర్‌ ‌విస్తృతమైన నివేదికను తోసిపుచ్చడం సురక్షితం కాదు. కమిషనర్‌ ‌నిజాయితీ, అప్రమత్తత ప్రశ్నించడానికి తావు లేనివి. కమిషనర్‌ ‌తన పనిని ఎంతో శ్రద్ధగా, శ్రమతో పూర్తి చేసిన తీరు నివేదికలో ప్రతిబింబిస్తుంది. ఏదేమైనా, అటువంటి నిపుణుల అభిప్రాయాన్ని న్యాయస్థానం వడపోసి, మూల్యాంకనం చేయాలి. దానిని స్వతహాగా అంతిమ నిర్ణయంగా పరిగణించరాదు. ఆధునిక న్యాయస్థానాలు తమ ముందున్న వివాదాన్ని అంచనా వేయడానికి పాటించాల్సిన మరో సూత్రం ఏమిటంటే, బహుళ విభాగాలు, అంతర్‌-‌విభాగ విధానాలను కలిగి ఉన్న పురావస్తు శాస్త్రమే, అటువంటి నిపుణులు తయారుచేసిన నివేదికకు బలం చేకూరుస్తుంది. దానిని బలహీనమైన సాక్ష్యంగా ముద్ర వేయరాదు. కనుగొన్న విషయాల అంచనాను సంపూర్ణ సత్యం ఆధారంగా కాకుండా, సంభావ్యతల ప్రాబల్యం అనే సూత్రాన్ని వర్తింపచేయాలి. సంభావ్యతల ప్రాబల్యాన్ని ఆమోద యోగ్యమైన ప్రమాణంగా పరిగణించాలి. వివాదాస్పద భవనానికి సొంత పునాది లేకుండా, ఇప్పటికే ఉన్న గోడలపై నిర్మించినప్పుడు, లేదా ప్రస్తుత అంతస్తు అంతకుముందున్న భవనం అంతస్తుకు సరిగ్గా పైన ఉన్నప్పుడు, బలవంతపు కూల్చివేతకు సంబంధించిన నిర్ధారణలు ఊహాజనితమైనవి కావచ్చు. న్యాయస్థానం నివేదికను మొత్తంగా చదవాలి. దానిలోని నిర్ధారణలను సందర్భోచితంగా అంచనా వేయాలి. అభ్యంతరాలను వాస్తవికంగా పరిగణించాలి .తీసుకున్న నిర్ధారణలకు రికార్డులో ఉన్న ఆధారాలు మద్దతు ఇస్తున్నాయో లేదో నిర్ధారించాలి.
  • వివాదం ధార్మికపరమైన స్వభావం, చారిత్రక ఉపయోగం, ఆరాధన కొనసాగింపు, లేదా రక్షిత లేదా వివాదాస్పద ధార్మికపరమైన ప్రదేశంపై పోటీ వాదనలకు సంబంధించినది అయినప్పుడు, ఒక నిర్దిష్ట ధర్మానికి చెందిన పూర్వ-ఉనికి నిర్మాణాన్ని ప్రదర్శించే ధార్మికపరమైన మూలాంశాలు, కళ, వాయిద్యాలు, శిల్పాలు, శాసనాలు, వాస్తు భాగాల పురావస్తు ఆధారాలు అధిక సాక్ష్య విలువను కలిగి ఉండవచ్చు. అందువల్ల, ధార్మికపరమైన చిహ్నాలు, వాటి స్థానం,  అటువంటి చిహ్నాలను అవతలి పక్షం గుర్తించడం వంటివి కలిసి, కేవలం అమూర్త (ఆకారంలేని) విశ్వాసాన్ని మాత్రమే కాకుండా, వాస్తవ ధార్మికా రాధన,  కొనసాగింపును కూడా బల పరుస్తాయని అయోధ్య తీర్పు గుర్తించింది. ఒక నిర్దిష్ట సందర్భంలో, పై నిర్మాణం కూల్చివేతకు గురైనా లేదా నాశనమైనా లేదా ధార్మికపరమైన మార్పిడికి నోచుకున్నప్పటికీ విశ్వాసంలో స్థిరత్వానికి సుప్రీంకోర్టు అధిక విలువను ఆపాదిస్తుంది.
  • భోజశాల విషయాన్ని హిందువులకు అనుకూలంగా నిర్ణయించడంలో అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు చూపిన అసాధారణ ప్రభావాన్ని మధ్యప్రదేశ్‌ ‌హైకోర్టు ముగింపు వ్యాఖ్యలు చక్కగా వివరిస్తాయి. అది ఇలా పేర్కొంది: వివాదాస్పద ప్రాంతం స్వభావాన్ని నిర్ధారించడానికి, అయోధ్య కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించిన పైన పేర్కొన్న 10 సూత్రాలను మనం దృష్టిలో ఉంచుకోవాలి’’ అని   హైకోర్టు పేర్కొంది.

    ఎ. ‌సూర్యప్రకాశ్‌
    ‌మాజీ చైర్మన్‌, ‌ప్రసారభారతి