News

వక్ఫ్ బోర్డు కబంధ హస్తాల నుంచి భూముల విడుదల..

45views

వక్ఫ్ బోర్డు వివాదాల కారణంగా ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు పరిష్కారం లభించింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PJS)లో రైతులు తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురాగా, వాటిపై స్పందించిన ప్రభుత్వం దశలవారీగా పరిష్కార చర్యలు చేపట్టింది.

నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం గూటుపల్లి గ్రామంలోని 2 వేల 74 ఎకరాలను నిషేధిత భూముల జాబితా నుంచి తొలగిస్తూ…. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాన్ని పరిష్కరించి, సంబంధిత రెవెన్యూ రికార్డుల్లో భూమిని నమోదు చేయడం ద్వారా సుమారు 1,800 కుటుంబాలకు ఊరట కలిగింది.

అధికారుల వివరాల ప్రకారం,నంద్యాల జిల్లాలో వక్ఫ్ బోర్డు పరిధిలో మొత్తం 2,054 ఎకరాల భూమి వివాదాస్పదంగా ఉంది. ఇందులో ఒక భాగానికి సంబంధించిన సమస్య ఇప్పటికే పరిష్కారం కాగా, ఇంకా సుమారు 600 ఎకరాల భూమికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. ఈ వివాదాల వల్ల 897 మంది రైతులు ప్రభావితమయ్యారని అధికారులు తెలిపారు.

<img src="https://vskandhra.org/wp-content/uploads/2026/07/Screenshot-2026-07-11-151309.png" alt="" width="677" height="438″ class=”aligncenter size-full wp-image-90237″ />

వక్ఫ్ బోర్డుతో అవసరమైన ప్రక్రియలు పూర్తైన అనంతరం మిగిలిన భూములను కూడా రెవెన్యూ పరిధిలోకి తీసుకువచ్చి, అర్హులైన భూయజమానులకు అప్పగించే చర్యలు కొనసాగుతున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. ప్రక్రియ పూర్తయిన తర్వాత రైతులు తమ భూములపై పూర్తి హక్కులు పొందడంతో పాటు, వాటిని స్వేచ్ఛగా వినియోగించుకోవడం లేదా విక్రయించుకోవడం సాధ్యమవుతుందని పేర్కొంది.

ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యను సమగ్రంగా పరిష్కరిస్తున్నామని, దాదాపు మూడు సంవత్సరాల వ్యవధిలో వక్ఫ్ భూములకు సంబంధించిన అన్ని వివాదాలను పరిష్కరించి, భూములపై యజమానుల హక్కులను పూర్తిగా పునరుద్ధరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.