
7views
వేర్పాటువాదులను ప్రశంసిస్తూ రాసిన రెండు పుస్తకాలను పాఠశాలలకు పంపిణీ చేసిన ఘటనలో 8 మంది అధికారులను సస్పెండు చేస్తూ జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. పాఠశాలల లైబ్రరీలకు చేరిన ఆ పుస్తకాలను వెనక్కి తెప్పించారు. హిలాల్ అహ్మద్, సంతోష్ మీనా అనే ఇద్దరు కలిసి రాసిన ‘పర్సనాలిటీస్ అండ్ లెజెండ్స్ ఆఫ్ జే అండ్ కే’ (జమ్మూ కశ్మీర్ ప్రముఖులు, చరిత్ర పురుషులు), సుశాంత్ గిరి రాసిన ‘గ్రేట్ పర్సనాలిటీస్ ఆఫ్ జమ్మూ అండ్ కశ్మీర్’ (జమ్మూ కశ్మీర్ గొప్ప వ్యక్తులు) అన్న ఈ పుస్తకాల ప్రతులను పాఠశాలల గ్రంథాలయాలకు సరఫరా చేశారు. అవి వేర్పాటు వాదాన్ని గొప్పగా అభివర్ణించాయని భాజపా, కాంగ్రెస్ లు నిరసన వ్యక్తం చేశాయి.





