News

ఉత్తరప్రదేశ్‌లో మరో లవ్ జీహాద్.. హిందూ యువకుడిని ఇస్లాంలోకి మార్చారని కుటుంబం ఫిర్యాదు

33views

ఉత్తరప్రదేశ్‌లోని షమ్లీ జిల్లాలో మరో మతమార్పిడి ఆరోపణ వెలుగులోకి వచ్చింది. భావుఖేడా గ్రామానికి చెందిన ఓ హిందూ కుటుంబం, తమ కుమారుడిని ఓ ముస్లిం మహిళ బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే తమ కుటుంబానికి చెందిన 22 ఎకరాల భూమిని ఆమె పేరుపై బదిలీ చేయాలని ఒత్తిడి చేస్తూ, అంగీకరించకపోతే ప్రాణహాని కలిగిస్తానని బెదిరిస్తున్నట్లు బాధితుడి తండ్రి ఆరోపించారు.

బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం, సుమారు ఏడాదిన్నర క్రితం సహరాన్‌పూర్‌కు చెందిన ఆ మహిళ తమ ఏకైక కుమారుడిని తనతో తీసుకెళ్లిందని, అనంతరం అతను ఇస్లాం మతాన్ని స్వీకరించినట్లు తెలిసిందని పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టారు.

న్యాయం కోసం బాధిత కుటుంబ సభ్యులు బఘ్రాలోని సాధన పీఠ్ ఆశ్రమం అధిపతి స్వామి యశ్‌వీర్ మహారాజ్‌ను కలిసి తమ సమస్యను వివరించారు. ఈ అంశంపై స్పందించిన స్వామి యశ్‌వీర్ మహారాజ్, వీడియో సందేశం విడుదల చేసి ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగాన్ని కోరారు.

ఈ వ్యవహారం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జింఝానా పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ (SHO)కు పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎన్.పి. సింగ్ తెలిపారు.