
603views
ఛత్తీస్గఢ్లో మరోసారి మావోయిస్టులు ఆకస్మికంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఛత్తీస్‌గఢ్ సాయుధ దళానికి (సీఏఎఫ్) చెందిన ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో బాంబు దాడి ఘటనలో సీఆర్పీఎఫ్‌కు చెందిన జవాను ఒకరు గాయపడ్డారు.
బస్తర్ జిల్లాలోని మర్దూమ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనుల వద్ద సీఏఎఫ్ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో సీఏఎఫ్‌కు చెందిన ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు మృతిచెందినట్లు ఐజీ తెలిపారు. మర్దూమ్ ఏరియాలో జరిగిన మరో ఐఈడీ పేలుడు ఘటనలో సీఆర్పీఎఫ్ జవాను ఒకరు గాయపడ్డారు. అతనికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.





