
ల ఆరోగ్య భారతి నంద్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 20, 21 తేదీలలో అయ్యలూరు గ్రామ పరిధిలోని ఎస్‌వీఆర్ ఇంజినీరింగ్ మరియు పాలిటెక్నిక్ కళాశాలల్లో ఆరోగ్య, యోగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ రామకృష్ణారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ శ్రీ వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. ప్రధాన వక్తగా హాజరైన అఖిల భారతీయ సహ సంఘటనా కార్యదర్శి డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ, భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన ఆరోగ్య వరం యోగా అని పేర్కొన్నారు. నేడు ప్రపంచంలోని అనేక దేశాలు యోగాను తమ నిత్యజీవితంలో భాగంగా చేసుకుని ఆరోగ్యవంతమైన జీవనం గడుపుతున్నాయని తెలిపారు.
విద్యార్థులు యోగాను నిత్యజీవితంలో అలవాటు చేసుకుంటే శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థిరత్వం పెంపొందుతుందని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలను సాధించగలరని చెప్పారు. అలాగే ఆరోగ్యవంతమైన, ఆదర్శవంతమైన జీవనం ద్వారా తల్లిదండ్రులకు, సమాజానికి, దేశానికి కీర్తి తీసుకురాగలరని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆరోగ్య భారతి జిల్లా అధ్యక్షుడు శ్రీ పరమేశ్వర్‌రెడ్డి, కార్యదర్శి శ్రీ చెన్నకేశవులు, కార్యకర్తలు శ్రీ విజయభాస్కర్‌రెడ్డి, శ్రీ వీరప్ప, శ్రీ పుల్లయ్య, శ్రీ తిరుపాలు, డాక్టర్ బాల వెంకటకృష్ణ, డాక్టర్ నరహరి, శ్రీ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మొత్తం 130 మంది విద్యార్థులు (70 మంది యువకులు, 60 మంది యువతులు) పాల్గొని యోగా సాధన చేశారు.





