
41views
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అమెరికా వ్యోమగామి మైక్ ఫింక్ చేసిన అస్సాం జానపద ‘బిహు నృత్యం’పై ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ హర్షం వ్యక్తం చేశారు. అస్సామీ నూతన సంవత్సరానికి గుర్తుగా రాష్ట్రం ‘రంగోలీ బిహు’ జరుపుకొంటున్న సందర్భంగా ఆ వీడియోను ‘ఎక్స్’లో ఆయన పోస్టు చేశారు. మైక్ సతీమణి రెనితా సైకియా అస్సామీ మూలాలున్న మహిళ. వీడియోలో మైక్ అస్సాం సంప్రదాయ వస్త్రమైన ‘గమోసా(కండువా)’ను మెడలో ధరించి బిహు నృత్యం చేశారు. ‘అస్సాం నృత్యం పట్ల మైక్ చూపిన ప్రత్యేక గౌరవానికి ధన్యవాదాలు. ‘బిహు బినం దియా’ సందర్భంగా ఈ నృత్యంపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి సారించిన అనంతరం దీనికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది’ అని హిమంత పేర్కొన్నారు.





