News

23న రాష్ట్ర పండుగగా భగీరథ జయంతి

53views

ఈ నెల 23న మహర్షి భగీరథుని జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత వెల్లడించారు. ఆరోజు రాష్ట్ర వ్యాప్తంగా భగీరథుని జయంతి అధికారికంగా నిర్వహించేలా కూటమి ప్రభుత్వం జీవో జారీచేసిందన్నారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. సగర కులస్తుల ఆరాధ్య దైవం మహర్షి భగీరథుడన్నారు. ఒంటికాలిపై నిల్చొని, భారీ తపస్పు చేసి, గంగను దివి నుంచి భువి తీసుకొచ్చిన మహానీయుడన్నారు. తన పట్టుదలతో, కఠోర తపస్సుతో భగీరథుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారన్నారు. భగీరథుని త్యాగం, పట్టుదల నేటి తరానికి తెలియజేయాలన్న సంకల్పంతో ఆ మహానీయుని జయంతిని ఈ నెల 23న రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహించనున్నామన్నారు. కర్నూలులో భగీరథుని రాష్ట్ర స్థాయి జయంత్యోత్సవం చేపట్టనున్నామన్నారు. గతేడాది విశాఖలోని గాజువాకలో అంగరంగ వైభవంగా భగీరథుని రాష్ట్ర స్థాయి జయంతిని నిర్వహించినట్లు మంత్రి సవిత గుర్తు చేశారు.