
అస్సామీలు కొత్త సంవత్సర ఆగమనంగా భావించే ‘బోహాగ్’ నెల ఆరంభంతో రాష్ట్రమంతా వేడుకలు మొదలయ్యాయి. స్థానిక జానపద నృత్యం ‘రొంగాలీ బిహూ’ ఈ వేడుకల ప్రత్యేకత. గురువారం నాగావ్ జిల్లాలోని పురనీగుదామ్‌లో 1,500 మంది నృత్య కళాకారిణులు డప్పు చప్పుళ్ల నడుమ ప్రదర్శించిన బిహూ నృత్యానికి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’ గుర్తింపు లభించింది. 45 రోజులపాటు శిక్షణ పొందిన కళాకారుల బృందం స్థానిక బాపూజీ భవన్ మైదానంలో ఈ ప్రదర్శన ఇచ్చింది. నాగావ్ డిప్యూటీ కమిషనరు దేవశిష్ శర్మ, ‘ఇండియా బుక్’ అధికారులు వీక్షించారు. 2023లో ఈ నృత్యానికి ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్’ గుర్తింపు సైతం దక్కింది.
అస్సాం సంప్రాదాయ వాయిద్యాలు అయిన ధోల్, ధోల్, తాల్, గోగోనా, టోకా, పెపా, జుతులి వంటి వాటిని వాయించే సంగీత కళాకారులు ఇందులో పాల్గొన్నారు. అస్సాం సాంస్కృతిక వారసత్వానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్ కోసం ఉత్తమ ప్రదర్శనకారులను తీసుకురావడానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రాక్టీస్ సెషన్స్ నిర్వహించారు.




