News

ఇస్లామిక్ ఉగ్రవాదులకు యావజ్జీవ కారాగార శిక్ష

23views

దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నిన ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో సంబంధమున్న ముగ్గురు ఇస్లామిక్ ఉగ్రవాదులకు యావజ్జీవ కారాగార శిక్షపడింది. దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నడంతో పాటు, యూపీలో బాంబు పేలుళ్లకు కుట్రపన్నారని పేర్కొంటూ లక్నోలోని జాతీయ దర్యప్తు సంస్థ ప్రత్యేక న్యాయస్థానం ఈ శిక్ష విధించింది. ముషిరుద్దీన్, మిన్హాజ్ అహ్మద్, తౌహీద్ అహ్మద్ అల్-ఖైదా అనుబంధ సంస్థ అయిన అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్‌తో సంబంధం కలిగి వున్నారు. లక్నో, కాన్పూర్, అయోధ్యలో అత్యంత సమన్వయంగా, ఒకేసారి ఉగ్రదాడులకు పాల్పడాలని వీరు కుట్రలు పన్నారు. దోషులుగా కూడా తేలారు.

లక్నోలోని జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జిస్టిస్ జైనేంద్ర పాండే ఈ తీర్పును వెలువరించారు. మిన్హాజ్, ముషీరుద్దీన్‌లకు చెరో రూ. 1.42 లక్షలు, తౌహీద్‌కు రూ. 85,000 చొప్పున జరిమానాలు కూడా విధించారు. ఈ ముగ్గురికీ ఏక కాలంలోనే శిక్ష అమలు చేయనున్నారు.

NIA 42 మంది సాక్షులను, 149 పత్రాలను, 109 సాక్ష్యాలను ప్రత్యేక దర్యాప్తు సంస్థ కోర్టుకు సమర్పించింది. 2021 జూలై మాసంలో ఈ ముగ్గురు ఇస్లామిక్ ఉగ్రవాదులు “ప్రెషర్ కుక్కర్ బాంబులు”, “ఫ్రూట్ బాంబులు” స్వయంగా తయారు చేసుకున్న పేలుడు పరికరాలను ఉపయోగించి, వరుస పేలుళ్లకు ప్రణాళికలు రచించారు. దీనిని యూపీ నిఘా వర్గాలు, ఏటీఎస్ నిందితులను అరెస్ట్ చేశాయి.