News

13 నుంచి తొలివిడత చందనం అరగదీత

75views

ఈనెల 13న ఏకాదశిని పురస్కరించుకుని సింహగిరిపై శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో తొలివిడత చందనం అరగదీతని వైభవంగా ప్రారంభించేందకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్‌, ఏఈవో తిరుమలేశ్వరరావు, సూపరింటెండెంట్‌ వెంకటేశ్వరరావు, ఎస్‌పిఎఫ్‌ సిబ్బంది పర్యవేక్షణలో ఉద్యోగి సాంబ చందనం చెక్కలను అరగదీతకు అణువుగా ముక్కలు కోశారు. అలాగే చందనం అరగదీతకు కావాల్సిన సానలను సిద్ధం చేశారు. కాగా ఏడాదిలో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి చందనోత్సవం రోజు రాత్రి, వైశాఖ పౌర్ణమి, జ్యేష్ట పౌర్ణమి, ఆషాడ పౌర్ణమి రోజుల్లో మూడేసి మణుగుల చొప్పున(125 కిలోలు చొప్పున) పచ్చిచందనాన్ని స్వామికి సమర్పిస్తారు. మొత్తం నాలుగు విడతల్లో సుమారు 500 కిలోల పచ్చిచందనాన్ని సమర్పిస్తారు. ఈనెల 20న చందనోత్సవాన్ని పురస్కరించుకుని తొలివిడతగా స్వామికి సమర్పించేందుకు కావాల్సిన మూడు మణుగుల పచ్చిచందనాన్ని సమకూర్చేందుకు ఈనెల 13 నుంచి అరగదీతను చేపట్టనున్నారు.