News

హుబ్లీలోని నివాస స్థలంలో అక్రమ మసీదు నిర్మాణం !

92views

కర్ణాటకలో  వాణిజ్య నగరమైన హుబ్లీలో ఒక అనధికార మసీదు నిర్మాణం నేపథ్యంలో పెద్ద వివాదం చెలరేగింది. ఇటీవల, హిందూ సంఘ  సభ్యులు మరియు స్థానిక నివాసితులు నిరసన చేపట్టారు. సవనూర్ ప్రాంతంలోని ఒక నివాస స్థలంలో మసీదును అక్రమంగా నిర్మిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ అనధికార నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

నిరసనకారుల తెలిపిన వివరాల   ప్రకారం, సదరు భూమిని మూడు, నాలుగు సంవత్సరాల క్రితం ప్రభుత్వ భూమిగా సేకరించారు. ఇప్పుడు, వాస్తవానికి ఇల్లు కట్టుకోవడం కోసం కొనుగోలు చేసిన భూమిలో అనధికార మసీదు నిర్మాణం ప్రారంభమైందని  నివాస ప్రాంతంలో మసీదు నిర్మాణం పట్ల స్థానిక నివాసితులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ అనధికార నిర్మాణానికి అనుమతి ఇవ్వడానికి హుబ్లీ-ధార్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులే   బాధ్యులని హిందూ సమాజ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

స్థానిక నివాసితులు మొదటి నుంచీ ఈ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ, మున్సిపల్ అధికారులు మౌనం వహించి, ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు.

“నివాస ప్రాంతాల్లో ఇలాంటి అనధికార నిర్మాణాలు శాంతికి భంగం కలిగిస్తాయి. నివాస ప్రాంతంలో మసీదు నిర్మించడం చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమే” అని నిరసనకారులు ఫిర్యాదు చేశారు.

ఆ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది; ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించడానికి భారీ పోలీసు బలగాలను మోహరించారు.