News

జార్ఖండ్ లో ‘స్వస్థత సేవ’ పేరుతో మతమార్పిడి చేసే ప్రయత్నం

122views

జార్ఖండ్ లోని గుమ్లాలో హిందువులను క్రైస్తవ మతంలోకి మార్చేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై ఇక్కడి ఛార్దా రోడ్ ప్రాంతంలో ఐదుగురు మిషనరీల మహిళాను అదుపులోకి తీసుకున్నారు. ఈ మహిళలు ఇంటింటికీ వెళ్లి, ‘స్వస్థత సభ’ (చంగై సభ) అనే పేరుతో జరిగే ఒక కార్యక్రమానికి హాజరు కావాలని ప్రజలను ప్రోత్సహిస్తున్నారు.

పుగ్గు మరియు చుట్టుపక్కల ప్రాంతాల నివాసులైన రోమిలా మింజ్, కిరణ్ కుజుర్, షకీరా టిర్కీ, సుశీలా దేవి, ఇందు దేవిలు ‘స్వస్థత సభ’కు సంబంధించిన కరపత్రాలను పంచడానికి సిసైలోని కుంహార్ మోడ్ ప్రాంతంలో ఇళ్లకు వెళ్లి ఈ సమావేశానికి హాజరైతే ‘వ్యాధుల నుండి విముక్తి, అద్భుతమైన ఆరోగ్యం, మరియు అద్భుత ప్రయోజనాలు’ లభిస్తాయని చెబుతూ ప్రజలను ప్రోత్సహిస్తున్నారు.

ఈ మహిళల ఉద్దేశాలపై కొంతమంది స్థానిక నివాసితులకు అనుమానం కలగడంతో, వారు హిందూ సంస్థలను అప్రమత్తం చేశారు. చార్దా రోడ్‌కు చెందిన ఆనంద్ సాహు, మిషనరీలు తన ఇంటికి వచ్చి, హిందూ దేవతల గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, హిందూ మతం మరియు సంప్రదాయాలను విడిచిపెట్టమని తనపై ఒత్తిడి చేశారని ఆరోపించారు.

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే, విశ్వ హిందూ పరిషత్ (VHP), బజరంగ్ దళ్ మరియు ఇతర సంస్థల కార్యకర్తలు సంఘటనా స్థలానికి చేరుకుని నిరసన తెలిపారు. దీనిపై పోలీసులు జోక్యం చేసుకుని, మిషనరీ మహిళలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.