News

అపురూపమైన బంగారు నగలు

101views

ఈ ఏడాది జనవరి 10వ తేదీన క‌ర్ణాట‌క‌లోని గదగ్‌ జిల్లా లక్కుండిలో లభించిన నిధి గురించి కొత్త విషయాలు వెలుగుచూశాయి. ఆ చారిత్రక గ్రామంలో ఓ మహిళ ఇంటి పునాది తవ్వతుండగా పురాతనమైన రాగి చెంబు, అందులో అపురూపమైన బంగారు నగలు లభించడంతో వాటిని ప్రభుత్వానికి అప్పగించారు.

పురావస్తుశాఖ అధికారులు ఆ బంగారు ఆభరణాలు సుమారు 600 సంవత్సరాల క్రితం నాటివని, కళ్యాణ చాళుక్య రాజులు, విజయనగర అరస రాజుల కాలం నాటివని నిర్ధారించారు. ఇవి మనుషులు ధరించేవి కావని, ఆలయాలలో దేవతలకు లేదా ఉత్సవ మూర్తులకు అలంకరించే ఆభరణాలని తెలిపారు. వీటి విలువ రూ.8 కోట్లని ప్రకటించారు.