
ఇరాన్, అమెరికా -ఇజ్రాయెల్ యుద్ధంతో ఇంధన సంక్షోభం ముసురుకుంటోంది. ఇప్పుడు భారత్‌లోనూ ఈ ప్రభావం కనిపిస్తోంది. మన దేశంలోని పలు ప్రాంతాలలో వంటగ్యాస్ కొరత ఏర్పడింది. ఎల్‌పీజీ సిలిండర్ ధర సగటున రూ.60 దాకా పెరిగింది. ఈ నేపథ్యంలో అందరి కళ్లూ ‘‘గోబర్ గ్యాస్ (బయో గ్యాస్) పై పడ్డాయి. ఆవు పేడతో బయో గ్యాస్ ను తయారు చేసుకుంటే.. ఎం చక్కా.. ఎల్పీజీ సిలెండ్లర భయం పడకుండా వుంటుంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో బెంగాల్ లోని గోపాల్ పూర్ గ్రామస్థులు పూర్తిగా బయో గ్యాస్ పైనే ఆధారపడుతున్నారు. అందరూ దీనినే అనుసరించాలని కూడా పిలుపునిస్తున్నారు. పశ్చిమ బుర్ద్వాన్ జిల్లా గోపాల్‌పూర్ గ్రామానికి చెందిన క్షేత్రనాథ్ గరై, అమ్జాన్ గరై ఆవు పేడతో ఇళ్లలోనే బయోగ్యాస్‌ను తయారు చేసుకుంటున్నారు.
గోపాల్‌పూర్ గ్రామానికి చెందిన క్షేత్రనాథ్ గరై, అమ్జాన్ గరై కుటుంబాలకు పెద్ద సంఖ్యలో ఆవులు ఉన్నాయి. దీంతో వారికి రోజూ పుష్కలంగా ఆవుపేడ లభిస్తుంది. ఈ పేడ, నీటిని 1:1 నిష్పత్తిలో కలిపి సజాతీయ మిశ్రమంగా మారుస్తారు. దీన్ని భూగర్భంలో తవ్విన ప్రత్యేక గొయ్యి (డైజెస్టర్ ట్యాంకు)లో నిల్వ చేస్తారు. ఇందులోకి గాలి కూడా చొరబడదు. ఫలితంగా ఈ ట్యాంకులోని పేడను బ్యాక్టీరియా విచ్ఛిన్నం చేస్తుంది. దీని పర్యవసానంగా పేడ నుంచి మీథేన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. డైజెస్టర్ ట్యాంకుకు మరో వైపున అమర్చిన పైపుల ద్వారా మీథేన్ గ్యాస్ అనేది వంటగ్యాస్ స్టవ్‌లోకి చేరుతుంది. క్షేత్రనాథ్ గరై, అమ్జాన్ గరై కుటుంబాలు ఇప్పుడు ఈవిధంగానే ఆవుపేడతో బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేసుకుంటున్నాయి. వంటగ్యాస్ సంక్షోభం ప్రభావం తమపై పడకుండా జాగ్రత్తపడుతున్నాయి.
ఈ వాయువులో ప్రధానంగా మిథేన్ సుమారు 50-90 శాతం, కార్బన్ డై ఆక్సైడ్ 25-45 శాతం, నైట్రోజన్ 0-10 శాతం, హైడ్రోజెన్ 0-3 శాతం మరియు నీరు 2-7 శాతం వరకు ఉంటాయి.పాడి పశువుల వ్యర్థాల నుండి బయోగ్యాస్ తయారగుట అనేది నాలుగు దశలలో జరుగుతుంది. అవి 1. వ్యర్థ పదార్థాల లిక్విఫికేషన్ లేదా హైడ్రోలైసిస్ 2. ఎసిడిఫికేషన్ 3. ఎసిటిక్ యాసిడ్ తయారగుట మరియు చివరకు మిథేన్ వాయువు తయారవుతుంది. ఒక కి.లో పాడి పశువుల పేడ నుండి సుమారు 0.03-0.04 క్యూబిక్ మీటర్ల గోబర్ గ్యాస్ ఉత్పత్తి జరుగుతుంది.
రెండు క్యూబిక్ మీటర్ల గోబర్ గ్యాస్ ప్లాంట్ ను మొదటి సారిగా ప్రాంభించాలంటే సుమారు 2 టన్నుల పేడను నీటితో కలిపి బయోగ్యాస్ ప్లాంట్ ఇన్లెట్ ద్వారా పంపించవలసి ఉంటుంది. దీనిని పంపించిన తరువాత ఈ ప్లాంటులోకి ఎటువంటి గాలి చొరబడకుండా దీని పై మూత వెయ్యాలి. 2-3 రోజులలో ఈ పేడ అంత ఎనరోబిక్ (గాలి రహిత) పెర్మంటేషన్ జరిగి మిథేన్ వాయువు (బయోగ్యాస్) తయారవుతుంది . ఈ గ్యాస్ను ఒక పైపు ద్వారా వంట గదిలోని స్టాకు కనెక్షన్ ఇచ్చి వంట గది అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.
గోబర్ గ్యాస్ ప్లాంట్ నుండి బయోగ్యాస్ తయారైన తరువాత మిగిలిన వ్యర్ధాలు (స్లర్రి) అవుట్లెట్ పైపు ద్వారా బయటకు వస్తుంది. ఈ స్లర్రీని వానపాములు వదిలినట్లైతే పర్మి కంపోస్టు తయారవుతుంది. ఈ విధంగా పాడి పశువుల పేడ నుండి బయోగ్యాస్ కాకుండా మంచి జీవ రసాయనాలు గల వర్మి కంపోస్టు కూడా తయారవుతుంది. 2 క్యూబిక్ మీటర్ల బయోగ్యాస్ ప్లాంట్కు ప్రతిరోజు సుమారు 15 కిలో గ్రాముల పేడ అవసరముంటుంది.
ఈ గోబర్ గ్యాస్ ను 1930 సంవత్సరంలో భారతీయ శాస్త్రవేత్తలు కనుగొనుట జరిగింది. భారత ప్రభుత్వం 1981 సంవత్సరంలో న్యామరల్ బయోగ్యాస్ మరియు మెస్మర్ మేనేజ్మెంట్ ప్రొగ్రామ్ నెలకోలిపి బయోగ్యాస్ ప్రోత్సాహించుట జరుగుతుoది. ఇప్పటి వరకు భారత ప్రభుత్వం మూడు రకాల బయోగ్యాస్ మోడల్స్ ను తయారు చేయగా (1. Khodi village Industrial Commision Model (2) Janatha Model (3) Deena bhandu Model) 36 Deena bhandu Model బాగా ప్రాచుర్యం పొంది నేటికి ఉపయోగంలో ఉంది.





