
141views
భారత్ టీ20 వరల్డ్ కప్పు కైవసం చేసుకుంది. ఇప్పటికే భారత్ వద్ద రెండు కప్పులు ఉన్నాయి. ఇది మూడోది. మూడు సార్లు టీ20 వరల్డ్ కప్పు కొట్టిన ఏకైక జట్టు టీమిండియా. భారత జట్టులో నిన్న అందరూ అదరగొట్టారు. బరిలోకి దిగిన బ్యాటర్లు న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూయించారు. ఈ కప్పులు కెప్టెన్ సూర్యకుమార్ అందుకోగానే హనుమాన్ ఆలయానికి పరుగులు తీశాడు. ఈ విజయం సాధించిన వెంటనే అర్ధరాత్రి భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్, అంతర్జాతీయ క్రికెట్ మండలి అధ్యక్షుడు జయ్ షా కలిసి అహ్మదాబాద్‌లోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. ప్రపంచ కప్ ట్రోఫీతో వెళ్లి ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారాయి. ఇక మ్యాచ్ అనంతరం దేవుడి దయ వల్లే గెలిచామని సూర్య వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.





