News

సంస్కృతికి ప్రాణాధారం ఆగమాలు

101views

వైష్ణవ ఆగమాలు భారతీయ దేవాలయాల సంస్కృతికి ప్రాణాధారమని డైరెక్టర్‌ డాక్టర్‌ కేటీవీ రాఘవన్‌ అన్నారు. జాతీయ సంస్కృత వర్సిటీ, తిరుపతి ఇందిరా గాంధీ రాష్ట్రీయ కళా కేంద్రం ప్రాంతీయ కార్యాలయం సంయుక్తంగా ‘శ్రీ పాంచరాత్రాగమే పవిత్రోత్సవాంతర్గత ప్రాయశ్చిత్త విధానం’ అనే అంశంపై వైష్ణవ ఆగమ ఉపన్యాస శ్రేణి కార్యక్రమాన్ని ఏజీఎన్‌సీఏ కార్యాలయంలో నిర్వహించారు.

రాఘవన్‌ మాట్లాడుతూ సంప్రదాయ శాస్త్ర విజ్ఞానాన్ని శాసీ్త్రయ వేదికల ద్వారా పునరుద్ధరించడం, యువతలో అవగాహన పెంపొందించడం, పండితులను ఒకే వేదికపైకి తీసుకురావడమే కార్యక్రమం లక్ష్యమన్నారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో ఐజీఎన్‌సీఏ తమ వంతు కృషి చేస్తుందన్నారు. ఎన్‌ఎస్‌యూ విశిష్టాద్వైత వేదాంత విభాగాధిపతి ప్రొఫెసర్‌ చక్రవర్తి రాఘవన్‌ మాట్లాడుతూ, అకడమిక్‌ పరిశోధనలు మరింత విస్తృతం కావాలని, ఆగమ అధ్యయనం సమకాలీన సందర్భంలో మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.

ఉపన్యాసం అనంతరం నిర్వహించిన ప్రశ్నోత్తర కార్యక్రమంలో పండితులు, అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, అర్చకులు, భక్తులు హాజరయ్యారు. కార్యక్రమంలో పద్మావతి అమ్మవారి ఆలయం సీనియర్‌ అర్చకులు, టీటీడీ ఆగమ సలహాదారులు కాండూరి శ్రీనివాసాచార్యులు, పండితులు పాల్గొన్నారు.