
శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ గర్భగుడి సమీపంలో సాధువులు మరియు శివ స్వాములపై జరిగిన దాడిని విశ్వ హిందూ పరిషత్ (VHP) తీవ్రంగా ఖండించింది. భక్తులపై బలప్రయోగం ప్రజాస్వామ్యానికి మచ్చగా పేర్కొంటూ, ఈ ఘటనపై స్పందిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆలయ గర్భగుడి సమీపంలో ఈనెల 9న శివస్వాములపై పోలీసులు లాఠీచార్జీ చేయడం అమానుష చర్యఅని, ఈ అంశంపై విచారణ చేసి అధికారులపై చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ – వీ హెచ్ పీ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి డిమాండ్ చేశారు.
కర్నూలు నగరంలోని కేసీ కెనాల్ వినాయక ఘాట్‌లో గల గణేశ మందిరం సమావేశ హాలులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివిధ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, ముందుస్తు ఏర్పాట్లు మల్లికార్జున స్వామి సన్నిధానంలో ఇటువంటి ఘటనలు జరగకూడదని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో వీహెచపీ రాష్ట్ర కోశాధికారి సందడి మహేశ్వర్, జిల్లా కార్యదర్శి ఈపూరి నాగరాజు, జిల్లా కోశాధికారి తుంగా రమేష్ పాల్గొన్నారు.





