
789views
ఢిల్లీలోని షాహిన్‌బాగ్ ప్రాంతంలో ఇటీవల కాల్పులు జరిపిన వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వ్యక్తేనని మంగళవారం పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపిన అనంతరం ఢిల్లీ నేర విభాగం పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించారు. సీనియర్ అధికారి రాజేశ్ దేవ్ తెలిపిన వివరాల ప్రకారం ఇటీవల షాహిన్‌బాగ్‌లో ఓ వ్యక్తి ‘జైశ్రీరాం’ అంటూ నినాదాలు చేస్తూ గాల్లోకి కాల్పులు జరిపాడు. అతడిని విచారించగా ప్రాథమిక దర్యాప్తులో నిందితుడు, అతడి తండ్రి గత సంవత్సరం క్రితమే ఆప్ చేరినట్లు నిర్దారణ అయింది. అతడి ఫోన్లో సైతం ఆప్ సీనియర్ నాయకులతో దిగిన పలు ఫోటోలను గుర్తించినట్లు చెప్పారు. చివరకు నిందితుడు కపిల్ గుప్తా ఆప్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు నిర్దారించారు.







