
ఉత్తరకాశి జోషియాడ ప్రాంతంలో మాంసం వ్యాపారులు గంగా ప్రాంతాన్ని కలుషితం చేస్తున్నారని హిందూ అనుకూల సంస్థలు నిరసన వ్యక్తం చేశాయి ప్రభుత్వానికి ఒక మెమోరాండం కూడా ఇచ్చాయి. మాంసం అమ్మకందారులు గంగానది ఒడ్డున జంతువులను వధించి వాటి అవశేషాలను నదిలో పడేస్తున్నారని, దీనివల్ల కాలుష్యం ఏర్పడుతుందని, అంతేకాక మతపరమైన మనోభావాలు దెబ్బతింటున్నాయని బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు పేర్కొన్నారు. గంగానదికి ఇరువైపులా 500 మీటర్ల పరిధిలో మాంసం అమ్మకాలను నిషేధించాలని ఆ సంస్థలు డిమాండ్ చేశాయ. ఈ మేరకు ప్రభుత్వానికి ఇచ్చిన మెమోరాండంలో పై విషయాలను ఉంచాయి. చార్‌ధామ్ యాత్ర మార్గంలో ఇటువంటి మాంసం దుకాణాలను ఉంచడం వల్ల ప్రజల మనోభావాలను అగౌరవపరిచేలా ఉందని కూడా సంస్థలు ఆరోపిస్తున్నాయి. అటువంటి ఉత్పత్తుల అమ్మకాలకు మున్సిపల్ కౌన్సిల్ లైసెన్స్‌లను రద్దు చేయాలి అని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.





