ArticlesNews

కోస్తాంధ్ర జిల్లాలో ఉద్యమంలా మతమార్పిడులు – అమాయకులే లక్ష్యంగా చెలరేగిపోతోన్న మాఫియా

156views

భారత్ అతి పెద్ద లౌకిక రాజ్యం. అంటే దేశంలో పౌరులు ఎవరి ఇష్టం వచ్చిన, వారికి నచ్చిన మతంలో కొనసాగవచ్చు. అలా అని బలవంతంగా, డబ్బు ఆశ చూపి, మరేదైనా ఆశ పెట్టి, భయపెట్ట మత మార్పిడి చేయడం నేరం. ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది. వేలాది మంది పాస్టర్లు మత మార్పిడికి పాల్పడుతున్నారు. ప్రభుత్వ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా చర్చి నిర్మించడం, వేలాది మందిని పోగు చేయడం వారికి వచ్చే ఆదాయంలో, వారు తీసుకునే అప్పుల్లో దశమ భాగం వసూలు చేయడంతో పాస్టర్లు లక్షాదికారులుగా మారుతున్నారు. ఇక మతం మారేవారికి ఎర వేస్తున్నారు. ఏజంట్ల ద్వారా పేదలను గుర్తించడం మతం మారితే అనేక ప్రయోజనాలు ఉన్నాయంటూ ఆశ చూపి వేలాది మందిని క్రిస్టియానిటీలోకి మారుస్తున్నారు. చాపకింద నీరులా ఈ వ్యవహారం సాగుతోంది. హిందూ సంఘాలు ఆందోళనలు చేస్తున్నా, వారిని పట్టించుకున్న వారే లేరు.

లక్షలాది పాస్టర్లు
దేవాలయంలో పూజారి, మసీదులో మౌజం, చర్చిలో ఫాదర్. ఇలా ఎవరి మతానికి వారు ప్రతినిధులు. అయితే పూజారులు పూజలకే పరిమితం అవుతారు. కానీ పాస్టర్లు అలా కాదు. తన చర్చికి వచ్చే భక్తుల సంఖ్య పెంచుకోవడంపై ఎక్కలేని అడ్డదారులు తొక్కుతున్నారు. కొందరు పాస్టర్లు ఆరు చర్చిలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఓ పాస్టర్ చర్చి నిర్మాణం పేరుతో 50 కోట్లు వసూలు చేశారు అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పాస్టర్లకు ఇది వ్యాపారంలా మారింది. బలవంతపు మతమార్పిడితోపాట, దశమ భాగం అంటూ వారి భక్తులతల కెక్కిస్తున్నారు. తినీ తినక కూలీ పనులు చేసుకునే వారిని కూడా వదలడం లేదు. చివరకు వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లు వచ్చినా అందులోనూ దశమ భాగం వసూళ్లు చేస్తున్నారు. అంతే ఫాదర్ పరిదిలో అతనికి వున్న బ్రాంచీల్లో భక్తులందరి ఆదాయంలో పది శాతం పొందుతున్నారు.

కోస్తాంధ్రలో గ్రామానికి సగటున 6 చర్చిలు పుట్టుకు వచ్చాయి. 200 ఇళ్లకు ఒకటి చొప్పున చర్చి నిర్మించారు. ముందుగా తాటాకుల్లో ప్రారంభించి పదేళ్లు తిరిగే సరికల్లా రెండంతస్తుల భవనంలా మారుతోంది. దీని వెనుక పాదర్ల నిరంతర శ్రమ దాగి ఉంది. భక్తులను పెంచుకోవడం, మతమార్పిడులు చేయడం, దశమభాగం వసూలు చేయడంలో ఫాదర్లదే కీలక పాత్ర.

ఎన్నికల సమయంలో ఫాదర్ల పాత్ర కీలకం
ఎన్నికల సమయంలో ఫాదర్లకు ఎక్కడ లేని గిరాకీ వచ్చి పడుతోంది. అన్ని పార్టీల అభ్యర్థులు పాదర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడుతున్నారు. ఒక్కో ఫాదరుకు సగటున రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల ముట్టజెపుతున్నారు. ఫాదర్ పరిధిలోని ఆయన ఫాలోవర్లు తను చెప్పిన వారికి ఓట్లు వేయించే క్రతువును విజయవంతంగా నడిపిస్తున్నాయి.

విజయవంతంగా దళితుల మతమార్పిడి
దళితుల మతమార్పిడి చేయడంలో ఫాదర్లు విజయవంతమయ్యారు. ప్రస్తుతం అగ్రకులాలపై ఫోకస్ పెట్టారు. ఎవరైనా అర్థంతరంగా భర్త చనిపోతే వెంటనే వారిని సంప్రదించి ఆ వితంతువును క్రిస్టియానిటీలోకి తీసుకెళుతున్నారు. వారి పిల్లల చదువులు మేమే చూసుకుంటామని, ఇళ్లు నిర్మించి ఇస్తామంటూ మత మార్పిడికి ఎర వేస్తున్నారు. పేద మహిళలు నిజమేనని నమ్మి పార్టీ మారినంత ఈజీగా మతాన్ని మార్చేసుకుంటున్నారు. తరవాత అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.

ఏపీలో అధికారికంగా 6 వేల చర్చిలుంటే, అనధికారికంగా మరో 35 వేల చిన్న చితకా చర్చిలు నడుస్తున్నాయి. ప్రభుత్వ స్థలాలు కనిపిస్తే ముందుగా పేదలతో గుడెసెలు వేయించడం, వెంటనే చర్చి ఏర్పాటు చేయడం ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. తరవాత పేదలకు ఎన్నికల సమయంలో పట్టాలు ఇప్పిస్తామంటూ ఎమ్మెల్యే అభ్యర్థులతో హామీలు వచ్చేలా చూడటం. ఈ తంతు ఒక ఉద్యమంలా సాగుతోంది. పేదలకు అండగా నిలుస్తున్నట్లు చూపుతూ, ఫాదర్లు మాత్రమే బలపడుతున్నారు.

మైకులతో చంపేస్తున్నారు
మతం మత్తులాంటిది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎవరి మతంపై వారికి అమితమైన విశ్వాసం. అయితే ఇతర మతాలను కూడా గౌరవించడం నేర్చుకోవాలి. అదే ఇప్పుడు లోపిస్తోంది. బజరుకు ఒక చర్చి నిర్మించడం వేళాపాళా లేకుండా మైకులు పెట్టి ప్రార్థనల పేరుతో చెవులు చిల్లులు పడేలా జనాలను వేధించడం, ఎవరైనా ఒకరూ అరా హిందువులు మిగిలితే ఆ ప్రాంతం వదిలి అయినా వెళ్లిపోవాలి. లేదంటే మతమైనా మారాలి అన్నట్లుగా టార్చర్ పెడుతున్నారు. ప్రార్థనాలయాలపై లౌడు స్పీకర్లు, మైకులు పెట్ట వద్దని హైకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నా, అమలు చేసేది ఎవరు చెప్పండి.

మతమార్పిడిలో భక్తి కన్నా యాపారమే ఎక్కువగా కనిపిస్తోంది. ఎవరికి ఎక్కువ భక్తులు ఉంటే, వారే గొప్ప ఫాదర్. ఓ ఫాదర్ హైదరాబాద్‌లో పది లక్షల చదరపు అడుగుల్లో స్టేడియం నిర్మించి ఆదివారం 2 లక్షల మందికి ప్రార్థనలు చేస్తున్నాడు. అతనికి ఏపీలోనూ అనేక శాఖలు వున్నాయి. అలాంటి వారికి సమాజంలో రాజకీయంగా మంచి పలుకుబడి వుంటోంది. రాజకీయ నాయకులు కూడా వారికి జీ హుజూర్ అంటున్నారు. ఇక బలవంతపు మతమార్పిడులను అడ్డుకునేది ఎవరు. హిందూ సంఘాలు ఆందోళన చేసినా వారిని పట్టించుకునే నాధుడే లేడు.