
జిహాద్.. జిహాద్.. అంటూ కొన్ని లక్షల మంది ప్రాణాలను తీసేస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాదం జిహాద్ విషయంలో కేరళ సీనియర్ ఐఏఎస్ అధికారి అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జిహాద్ అంటే ఉద్రిక్తత లేని జీవితం అని, ఇతరులను నాశనం చేయడానికి చేసే పవిత్ర యుద్ధం కాదని దివ్య ఎస్. అయ్యర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో వివాదం రేగింది.
మలయాళ పుస్తకం “ఖురాన్ అకం పొరుల్ – మానవికాఖ్యానం” (ఖురాన్ – ఇన్‌సైడ్ మీనింగ్స్ హ్యుమానిటేరియన్ ఇంటర్‌ప్రిటేషన్) తొమ్మిదవ సంపుటి విడుదల సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా దీనిపై చర్చ ప్రారంభమైంది. జిహాద్ అంటే ఇతరులను నాశనం చేయడానికి లేదా తీవ్రాతితీవ్రమైన మార్గంలో చేరడానికి కాదని, యుద్ధం లేని జీవితం గడపడమని అన్నారు.
జిహాద్‌కి ఆమె ఇలాంటి నిర్వచనం ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్ సమాజంలోని కొన్ని వర్గాలు మిలిటెంట్ హింసతో ముడిపెట్టే జిహాద్ అనే పదాన్ని ఆమె అత్యంత సహజత్వానికి, మృదుత్వానికి ముడిపెట్టడం ఏంటని ప్రశ్నలు వస్తున్నాయి. ఇస్లామిక్ వాదులే కొందరు జిహాద్ ను ఉగ్రవాద పరంగా పేర్కొన్నారని, ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాద దాడులు చేస్తున్నప్పుడు ఈ భావనను ఉపయోగించారని విమర్శకులు సోషల్ మీడియా వేదికగా పేర్కొంటున్నారు.
జిహాద్ ఆధారిత ఉగ్రవాదం కారణంగా భారత్ ఘోరంగా ప్రాణ నష్టానికి గురైంది. ఇటీవలే ఎర్రకోట సమీపంలో డాక్టర్ ఉమర్ నబీ చేసిన ఆత్మాహుతి దాడి, పహల్గామ్ పర్యాటకుల ఊచకోతతో పాటు అనేక ఉదాహరణలు కళ్ల ముందే వున్నాయి. వీటన్నింటినీ మరిచిపోయి దివ్య ఎస్. అయ్యర్ మాట్లాడటం విడ్డూరంగా వుంది.





