News

జేఎన్‌యూను సంస్కరించండి లేదా మూసేయండి : గురుమూర్తి

549views

భారత వ్యతిరేక భావజాలం జవహార్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ) డీఎన్‌ఏలోనే ఉందని ప్రముఖ ఆర్థిక వేత్త శ్రీ జి.గురుమూర్తి పేర్కొన్నారు. తమిళనాడులోని ఓ పత్రిక 50 వ వార్షికోత్సవానికి హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ యూనివర్శిటీని సంస్కరించనైనా సంస్కరించండి లేదా శాశ్వతంగా మూసివేయండి అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘జేఎన్‌యూ స్థాపనే భారత్‌కు వ్యతిరేకంగా జరిగిందని, దేశ పూర్వజులను, సంస్కృతిని, ఆధ్యాత్మికతను, విలువలను వ్యతిరేకించే పునాదులపై ఏర్పడిందన్నారు.

1969లో కాంగ్రెస్ చీలినపుడు కమ్యూనిస్టులు ఇందిరా గాంధీకి మద్దతిచ్చి, ఒకే ఒక్క డిమాండ్‌ను ఆమె ముందు ఉంచారని ఆయన తెలిపారు. ‘‘మీరు (కాంగ్రెస్) ఏది తీసుకున్నా పర్లేదు. కానీ, విద్యా వ్యవస్థను మాత్రం మాకు (కమ్యూనిస్టులు) అప్పజెప్పండి’’ అని కమ్యూనిస్టులు ఇందిరా గాంధీకి షరతు విధించినట్లు ఆయన పేర్కొన్నారు. జేఎన్‌యూ సృష్టికర్త అప్పటి విద్యామంత్రి నూర్ హసన్ అని, ఆ సంస్థ ఎలా ఉండాలి, ఎలా నడవాలి, ఏ సిద్ధాంతాల ప్రకారం ముందుకు నడవాలో కూడా ఆయన సూత్రీకరించారని గురుమూర్తి తెలిపారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.