
164views
ప్రసిద్ధ అయోధ్య క్షేత్రంలో బాల రాముని ప్రధానాలయం సహా అన్ని మందిరాల నిర్మాణం పూర్తయిందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. ‘‘రాముని ప్రధానాలయం, శివుడు, హనుమాన్, సూర్యదేవుడు, భగవతి మాత, అన్నపూర్ణాదేవిల మందిరాల్లో గోపురాలు సహా నిర్మాణాలన్నీ పూర్తయ్యాయి. తులసీదాసు మందిర నిర్మాణాన్ని పూర్తిచేసి, జటాయువు, ఉడత విగ్రహాలనూ ఏర్పాటుచేశాం. ఆలయ ఆవరణలోని 10 ఎకరాల్లో ఉద్యానవనాలతో సహా అభివృద్ధి పనులన్నీ ముగిశాయి’’ అని ట్రస్ట్ ‘ఎక్స్’లో పోస్ట్‌చేసింది. ఈ మందిరాల నిర్మాణం కీలక మైలురాయి, ప్రజల విశ్వాసానికి ప్రతీక అని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రశంసించారు.





