News

A to Z దేశభక్తులు

963views

యసు చిన్నదే అయినా వయసుకు మించిన పరిణతిని, సామర్థ్యాన్ని, ప్రతిభను కనబరుస్తుంటారు కొందరు చిన్నారులు. అలాంటి వారిని చూసి సహజంగా పిట్ట కొంచెం కూత ఘనం అంటూ ఉంటాం.

అలా ఘనమైన కూత కూసే పిట్ట విశాఖపట్నంలోని మాధవ విద్యా విహార్ కు చెందిన ఒకటవ తరగతి విద్యార్థి సీరా మనోజ్. ఈ బుడతడు ఆంగ్ల అక్షరమాల A నుంచి Z వరకు కల అక్షరాలతో జాతీయ నాయకులు, దేశభక్తుల పేర్లను గుక్క తిప్పుకోకుండా చెప్తాడు. మాధవ విద్యావిహార్ పాఠశాల గుడిలోవలోని రాష్ట్ర సేవా సమితి ఆధ్వర్యంలో నడుస్తున్న సంగతి తెలిసిందే.

ఆ చిన్నారి చెబుతున్న తీరు కనబరుస్తున్న ప్రతిభను చూసిన వారెవరైనా అబ్బుర పడక మానరు. ఆ కుర్రవాడు చెప్పే దేశభక్తుల పేర్లు వింటూ ఉంటే మన హృదయాలు పులకించి మనలోని దేశభక్తి పొంగి పొరలుతుంది. తన ప్రతిభతో ఎందరో దేశభక్తులను స్మరణకు తెచ్చిన బాల దేశభక్తుడు చిరంజీవి మనోజ్ ను ప్రశంసించకుండా ఉండలేం.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.