News

ANUలో అన్యమత చిచ్చు

764views

చార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని వసతి గృహంలో విద్యార్థి సంఘాల మధ్య  ఘర్షణ చెలరేగింది. ఓ విద్యార్థి సంఘం నాయకుడు వసతి గృహం గోడలపై అన్యమత ప్రచారానికి సంబంధించిన గోడ పత్రిక అంటించారు. దానిని ఎవరో చించి వేశారు. అందుకు కారణం మరో విద్యార్థి సంఘం అని గోడ పత్రికను అంటించిన వారు ఆరోపిస్తూ మరో విద్యార్థి సంఘం వారితో గొడవకు దిగారు. దాంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. రెండు సంఘాల మధ్య తోపులాట జరిగినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో ఓ విద్యార్థి సంఘం వారు మరో విద్యార్థి సంఘం పై ఎఫ్ ఏ సి ఉప కులపతి ఆచార్య రాజశేఖర్ కు ఫిర్యాదు చేశారు. ఉప కులపతి ఆ ఫిర్యాదును ఫిర్యాదుల విచారణ విభాగానికి పంపించారు.

రెండు విద్యార్థి సంఘాలనూ ఆయన పిలచి విచారణ చేపట్టారు. విశ్వవిద్యాలయంలో అన్యమత ప్రచారాన్ని నిలుపుదల చేయాలని, దాడికి పాల్పడిన విద్యార్థి సంఘం నాయకుడు బహిరంగ క్షమాపణ చెప్పాలని బాధిత విద్యార్థి సంఘం నాయకులు కమిటీ సభ్యులకు స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయంలో ఒక ఉన్నత అధికారి అండ చూసుకునే సదరు విద్యార్థి సంఘం కార్యకర్తలు రెచ్చిపోతున్నారని, విద్యార్థినులతోనూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని బాధిత విద్యార్థి సంఘం సభ్యులు కమిటీ దృష్టికి తెచ్చారు. వెంటనే కమిటీ సభ్యులు బాధిత విద్యార్థినులను పిలిపించి వివరాలు సేకరించారు. ఘటనపై వుపకులపతికి కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉంది.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.