
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మొదలైన ‘ఐ లవ్ మహ్మద్’ తాాజాగా హైదరాబాద్‌లో కూడా ‘ఐ లవ్ మహ్మద్’ బ్యానర్‌లు వెలిశాయి. చంద్రాయణ గుట్టలో కొందరు ముస్లిం యువకులు ఐ లవ్ మహ్మద్ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓ వీడియోలో రికార్డు చేసి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను ఉద్దేశించి తీవ్ర పదజాలాన్ని ఉపయోగించారు. వీడియోలో వారు మాట్లాడిన ప్రకారం.. ‘ఇది యూపీ కాదు, తెలంగాణ అందులోనూ హైదరాబాద్.. నీ ఆటలు ఇక్కడ సాగవు’ అని విమర్శించారు. బ్యానర్ ఏర్పాటు చేశాం.. దమ్ముంటే దీన్ని తీసి చూడండి అంటూ సవాల్ చేశారు. ఈ బ్యానర్ తొలగించాలంటే మమ్మల్ని దాటాలి.. మమ్మల్ని ఏమైనా అనుకోండి.. జిహాదీ, ఆటంక్ వాదీ ఏదైనా అనుకోండి. అని యూపీ సీఎంను ఉద్దేశించి తీవ్ర పదజాలాన్ని వాడారు.
అసలేంటి ఈ వివాదం?
సెప్టెంబర్ 4న కాన్పూర్‌లో మొదలైన వివాదం ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, హదరాబాద్ సహా పలు రాష్ట్రాలకు పాకింది. మొదట యూపీలో ఐ లవ్ మహ్మద్ అనే బ్యానర్ కాన్పూర్, రావత్‌పూర్ ప్రాంతంలో ఈద్-ఎ-మిలాద్ ఊరేగింపు సందర్భంగా ప్రదర్శించారు. ఈ ప్రదర్శనపై హిందూ సంఘాలు, స్థానికులు కొత్త సంప్రదాయం ఎందుకని అభ్యంతరాలు చేయడంతో వివాదం చెలరేగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వేడుకలు నిర్వహించే ప్రాంతంలో బ్యానర్‌లను తొలగించారు. మతపరమైన ఊరేగింపుల్లో కొత్త ఆచారాలను ప్రవేశపెట్టడాన్ని ప్రభుత్వ నిబంధనలు నిషేధించాయని స్థానిక డీసీపీ దినేశ్ త్రిపాఠి చెప్పారు. ఈ వ్యవహారంలో 24 మందిపై కేసులు అయినట్లు వార్తలు వచ్చాయి.
కానీ.. బ్యానర్లు పెట్టిన వారిపై కేసులు పెట్టలేదని పోలీసులు స్పష్టం చేశారు. అయితే, యూపీలో వివాదం ఇప్పుడిప్పుడే సద్దుమనుగుతున్న సమయంలో తాజాగా హైదరాబాద్‌లో కొందరూ ముస్లిం బ్యానర్ పెట్టి యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను ఉద్దేశించి సవాల్ విసిరారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీఎంను తిట్టినందుకు యువకులను వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు.





